సీతారామం.. కాస్త ఎక్కువే గురూ!

దుల్కర్ సల్మాన్‌ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించిన సీతరామం సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఆగస్టు 5వ తారీకున భారీ ఎత్తున విడుదల కాబోతున్న సీతారామం సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా ను అశ్వినీదత్‌ నిర్మించడంతో పాటు విభిన్న చిత్రాల దర్శకుడి గా పేరున్న హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.పైగా ఈ సినిమా లో మలయాళ స్టార్‌ అయిన దుల్కర్ సల్మాన్ నటించాడు.

మహానటి సినిమా తర్వాత ఈయనకు మంచి ఫాలోయింగ్ దక్కింది.తెలుగు లో ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్ లో ఈయనకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.

అలాంటి స్టార్‌ నటించిన సీతారామం సినిమా ను మొదలు పెట్టినప్పటి నుండి కూడా అంచనాలు అలా అలా పెంచేస్తూ పోయారు.ఒక మంచి ప్రేమ కథ ఈ సినిమా అంటూ మొదటి నుండి చెప్పారు.

Advertisement
Sitaramam Censor Report Has Arrived Details, Dulquer Salman, Hanu Raghavapudi, R

ప్రేమ అనేది యుద్దం అన్నట్లుగా ఒక మంచి థీమ్‌ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు హను రాఘవపూడి మొదటే ప్రకటించాడు.సినిమా అంతా బాగుండి ఉంటుందని ట్రైలర్ చూసిన తర్వాత మరింత నమ్మకం ను ప్రేక్షకుల్లో కలిగించారు.

ఇప్పుడు సెన్సార్‌ రిపోర్ట్‌ వచ్చింది.అయితే ఈమద్య కాలంలో సినిమాలన్నీ కూడా 140 నిమిషాలే ఉంటున్నాయి.

Sitaramam Censor Report Has Arrived Details, Dulquer Salman, Hanu Raghavapudi, R

అంటే రెండున్న గంటల నుండి రెండు పావు గంటల వరకు మాత్రమే ఉంటున్నాయి.కాని ఈ సినిమా మాత్రం ఏకంగా రెండున్నర గంటలు ఉంది.దాదాపుగా 20 నిమిషాలు అధికంగా ఈ సినిమా ఉండటం వల్ల ఎలా ఉంటుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎక్కువ సమయం సినిమా ఉంటే కొన్ని సార్లు బోరింగ్‌ గా అనిపించే అవకాశాలు ఉన్నాయి.కాని ఈ సినిమా అలా కాదని.మూడు గంటలు ఉన్నా బోర్‌ అనిపించదు అనేది టాక్‌.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

ఫిల్మ్‌ మేకర్స్ నమ్మకంను ఈ సినిమా ఎంత వరకు నెరవేర్చుతుంది అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు