తెలుగులో అప్పుడే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చిన 'సార్'!

టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సార్.

ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాతో తమిళ్ హీరో ధనుష్ తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా ప్రీమియర్స్ నుండే అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

ఇక ధనుష్ కెరీర్ లోనే తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ వసూళ్లు నమోదు అవుతున్నాయి.ఈ సినిమా మూడు రోజుల్లోనే మంచి గ్రాస్ ని అందుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

అంతేకాదు మొదటి రోజు కన్నా రెండవ రోజు, మూడవ రోజు ఈ సినిమా మరింతగా వసూళ్లను రాబట్టిందట.మూడవ రోజు ఆదివారం కావడంతో మంచి వసూళ్లు వచ్చాయి.

Advertisement
Sir Enters Profits In First Weekend, Dhanush, Sir Movie, Kollywood, SIR Movie Co

మొత్తానికి మేకర్స్ పెట్టుకున్న అంచనాలను అయితే సార్ రీచ్ అయ్యింది అనే చెప్పాలి.

Sir Enters Profits In First Weekend, Dhanush, Sir Movie, Kollywood, Sir Movie Co

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే లాభాలను అందుకున్నట్టు టాక్.ఈ సినిమా మూడు రోజుల్లోనే 16.5 కోట్ల రూపాయల వసూళ్ళను రాబట్టింది.తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి ప్రాఫిట్ జోన్ లోకి కూడా ప్రవేశించిందట.

అయితే సోమవారం టెస్ట్ కూడా పాస్ అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే.

Sir Enters Profits In First Weekend, Dhanush, Sir Movie, Kollywood, Sir Movie Co

ఇక తమిళ్ లో వాతి పేరుతో రిలీజ్ అయినా ఈ సినిమాలో సంయుక్త మీనన్ ధనుష్ సరసన హీరోయిన్ గా నటించగా.జివి ప్రకాష్ సంగీతం అందించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం అయితే ఉంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

మొత్తానికి వెంకీ అట్లూరి తెలుగు హీరోలకు సూపర్ హిట్ ఇవ్వకపోయినా తమిళ్ హీరోకు అయితే మంచి హిట్ ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు