Singer pranavi : నువ్వు పాడాలి అంటే ఒక రాత్రి నాతో ఉండాలన్నారు… సింగర్ ప్రణవి కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్( Casting Couch) ఉంది అనే సంగతి మనకు తెలిసిందే.

ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగాలన్న ఆశతో ఇండస్ట్రీలోకి వస్తారు అయితే కెరీర్ మొదట్లో కొంతమంది మాత్రం అవకాశాలు కల్పిస్తూనే వారీతో కమిట్మెంట్ అడుగుతూ ఉంటారు.

ఇలా తమ కోరికలు తీరుస్తేనే సినిమాలలో అవకాశాలు కల్పిస్తామంటూ కొందరు లేడీస్ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయాన్ని ఇదివరకు పలువురు సెలబ్రిటీలు బహిరంగంగా వెల్లడించారు.

తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమేనని అవకాశాలు రావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అని కమిట్మెంట్స్ అడిగారని పలువురు సెలబ్రిటీలు మీడియా సమావేశంలో తెలియజేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా సింగర్ ప్రణవి( Singer Pranavi )సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈమె తన భర్త రఘు మాస్టర్ ( Raghu Master )తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Singer Pranavi Shocking Comments About Casting Couch
Advertisement
Singer Pranavi Shocking Comments About Casting Couch-Singer Pranavi : నువ

ఇంటర్వ్యూ సందర్భంగా ప్రణవి కెరియర్ మొదట్లో తనకు ఎదురైనటువంటి చేదు సంఘటనల గురించి తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రణవి మాట్లాడుతూ.ఓ డైరెక్టర్ తన గొంతు బాగుందని చెప్పి ఓ సినిమాలో పాట పాడటానికి పిలిచారు.

అయితే అతనిని కలిసిన తర్వాత తనకు ఈ సినిమాలో పాటలు పాడే అవకాశం రావాలి అంటే ఒకరోజు రాత్రి తనతో ఉండాలని ఉద్దేశంతోనే మాట్లాడారని ఈమె తెలియజేశారు.

Singer Pranavi Shocking Comments About Casting Couch

ఈ విధంగా అవకాశం కావాలంటే తనతో ఉండాలంటూ ఆ వ్యక్తి అడగడంతో నాకు చాలా కోపం వచ్చిందని దీంతో ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవంటే చెప్పు తెగుతుంది అంటూ తనకు బాగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వచ్చేసాను అంటూ తనకు ఎదురైనటువంటి చేదు సంఘటనల గురించి చెబుతూ ప్రణవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇండస్ట్రీలో ఇలా చాలామంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటూ ప్రణవి తెలియజేశారు.ఇక నా విషయానికి వస్తే తన వరకు రానంతవరకు నేను ఎవరి జోలికి వెళ్ళను.

నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడిన చెడుగా ప్రవర్తించిన వారి అంతు చూస్తాను అంటూ ఈ సందర్భంగా ప్రణవి తెలిపారు.ఇండస్ట్రీలో హీరోయిన్లకు క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రమే కాకుండా ఇలా సింగర్లకు కూడా క్యాస్టింగ్ ఇబ్బందులు ఉంటాయి అంటూ సింగర్ ప్రణవి ఈ సందర్భంగ కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

నితిన్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు