రెండోసారి తల్లి కాబోతున్న సింగర్ గీతామాధురి.. ఫోటోలు వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ గీతామాధురి( Geetha Madhuri ) ఒకరు.

ఈమె ఎన్నో అద్భుతమైనటువంటి పాటలను ఆలపించి ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇప్పటికీ పలుషోలకు న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

అలాగే ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారని చెప్పాలి.ఇక ఈమె నటుడు నందుని( Nandhu ) ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

నందు ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఈ మధ్యకాలంలో ఈయన ఎక్కువగా వెబ్ సిరీస్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

తాజాగా ఈయన వధువు అని వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.

Advertisement

ఇందులో చిన్నారి పెళ్లికూతురు నటి అవికా గోర్ నటిస్తున్నారు.ఇక నందు కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే గీత మాధురి నందుల వివాహం జరిగిన తర్వాత వీరికి మొదట సంతానంగా కూతురు జన్మించిన విషయం మనకు తెలిసిందే.ఈ చిన్నారికి దాక్షాయిని ప్రకృతి అనే నామకరణం కూడా చేశారు.ఇక ఈ చిన్నారికి దాదాపు 5 సంవత్సరాల వయసు ఉంది.

అయితే మరోసారి గీతామాధురి తల్లి కాబోతున్నారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే తల్లి కాబోతున్నాను అంటూ శుభవార్తను ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె తెలియజేశారు.

తన కుమార్తె దాక్షాయిని ప్రకృతి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో అక్కగా ప్రమోట్ కాబోతుంది అంటూ ఈమె తాను ప్రెగ్నెంట్( Pregnant ) అనే విషయాన్ని తెలియజేశారు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

ఇలా గీతా మాధురి మరోసారి తల్లి కాబోతున్నాను అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన భర్త కూతురితో కలిసి దిగిన ఫోటోలను ఈమె చీర కట్టుకొని ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.అయితే ఈ చీర ఫోటోలలో కూడా తన బేబీ బంప్ ( Baby Bump ) క్లియర్ గా కనిపిస్తుంది.ఇలా గీతా మాధురి తల్లి కాబోతున్నాను అంటూ ఈ సందర్భంగా చేస్తున్నటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు తోటి సింగర్లు నటీనట్లు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

మరొక రెండు నెలలలో గీతామాధురి మరొక బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది.

తాజా వార్తలు