వ‌ర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!!

వేసవి వేడి నుండి ఉపశమనం కలిగించి, మనల్ని రిఫ్రెష్ చేయ‌డానికి వ‌ర్షాకాలం రానే వ‌చ్చింది.

పిల్లలు నుంచి పెద్దలు వ‌ర‌కు వ‌ర్షాకాలాన్ని( Rainy season ) ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు.

అయితే వ‌ర్షాకాలానికి మ‌రో పేరు కూడా ఉంది.అదే వ్యాధుల కాలం.

ఈ సీజ‌న్ ను మ‌నం ఎంత ఇష్ట‌ప‌డ‌తామో.బాక్టీరియా మరియు వైరస్‌లు కూడా అంతే ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తాయి.

ఎందుకంటే, వైరస్‌లు మరియు బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి వర్షాకాలమే సరైన సమయం.అందుకే ఎక్కువ శాతం మంది ఈ కాలంలోనే జ‌బ్బుల బారిన ప‌డుతుంటారు.

Advertisement
Simple Health Tips For Monsoon! Monsoon, Monsoon Health, Health, Health Tips, Go

అయితే రుతుపవనాలను ఆస్వాదిస్తూ వ‌ర్షాకాలంలో ఆరోగ్యంగా, ప్ర‌శాంతంగా ఉండాలంటే త‌ప్ప‌నిస‌రిగా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ( Immune system ) బ‌ల‌హీన‌ప‌డుతుంది.ఇది వివిధ రకాల వ్యాధులకు దారితీస్తుంది.

కాబ‌ట్టి మొద‌ట మ‌నం మ‌న ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచుకోవాలి.ఇమ్యూనిటీని పెంచ‌డానికి సుల‌భ‌మైన మార్గం విట‌మిన్ సి ను తీసుకోవ‌డం.

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం కోసం మొలకలు, తాజా ఆకుపచ్చ కూరగాయలు మరియు సిట్ర‌స్ పండ్లు తీసుకోండి.వర్షాకాలంలో చాలా మంది తక్కువ నీరు తీసుకుంటారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

కానీ మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేటెడ్‌గా ఉండాలి.హైడ్రేటెడ్ గా ఉండాలంటే శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.

Advertisement

ఈ సీజన్‌లో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువ‌.కాబ‌ట్టి, శుభ్రమైన మరియు శుద్ధి చేసిన నీటిని మాత్ర‌మే తీసుకోవాలి.

అలాగే ఈ వ‌ర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ తీసుకోవ‌డం మానుకోండి.ఎందుకంటే, వీటి ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి.

వర్షాకాలంలో అత్యంత ప్రమాదకరమైన సమస్యల్లో దోమల వృద్ధి ఒకటి.ఓపెన్ వాటర్ స్టోరేజ్( Open water storage ), ఇంటి చుట్టూ స్తబ్దుగా ఉండే నీటి కుంటలు ఇలాంటి క్రిమికీటకాలకు ఆధారం.అందువ‌ల్ల అటువంటివి లేకుండా చూసుకోండి.

ఇంట్లోకి దోమ‌లు, ఈగ‌లు( Mosquitoes , flies ) రాకుండా జాగ్ర‌త్త తీసుకోండి.మార్కెట్ నుండి కొనుగోలు చేసిన పండ్లు మరియు కూరగాయలను ఉప్పు నీటిలో శుభ్రంగా క‌డిగిన త‌ర్వాతే తినండి.

చాలా మంది వ‌ర్షాకాలంలో వ్యాయామ‌లను స్కిప్ చేస్తుంటారు.కానీ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు అదుపులో ఉండ‌ట‌మే కాదు వైరస్‌లు మరియు బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

కాబ‌ట్టి ప్ర‌తినిత్యం ఏదో ఒక వ్యాయామం చేయండి.

ఇక ఈ వ‌ర్షాకాలంలో కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.చేతుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోండి.మ‌రీ ముఖ్యంగా ఆహారాన్ని తీసుకునేటప్పుడు హ్యాండ్ వాష్ త‌ప్ప‌నిస‌రి.

ఉతికిన పొడి బ‌ట్ట‌లు మాత్ర‌మే ధ‌రించండి.ప్రోబయోటిక్స్ ఎక్కువ‌గా తీసుకోండి.

ఈ జాగ్ర‌త్త‌లు వ‌ర్షాకాలంలో మిమ్మ‌ల్ని జ‌బ్బుల నుంచి ర‌క్షించ‌డానికి, ఆరోగ్యంగా ఉంచ‌డానికి ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయి.

తాజా వార్తలు