Akhil Akkineni : ఏజెంట్ సినిమాకు తప్పని కష్టాలు.. డైరెక్టర్ నిర్మాత మధ్య విభేదాలు నిజమేనా?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కింగ్ అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna )తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సరైన హిట్టు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నప్పటికీ సక్సెస్ ను సాధించలేకపోతున్నాడు.

2021 లో విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పర్వాలేదు అనిపించేలా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.ఇకపోతే అఖిల్ ప్రస్తుతం తాజాగా నటిస్తున్న చిత్రం ఏజెంట్( agent ).ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న విషయం తెలిసిందే.

అఖిల్ కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న మొట్ట మొదటి సినిమా ఇదే కావడం విశేషం.ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇక ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

Advertisement

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది.అయితే ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్రానికి కష్టాలు మొదలైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకి ఈ సినిమాని ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చివరగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.ఇప్పుడు రిలీజ్ కి నెల కూడా సమయం కూడా లేదు.కానీ ఏజెంట్ విడుదల దిశగా అడుగులు పడుతున్నట్లు ఎలాంటి సందడి లేదు.

దీంతో ఈ సినిమా ఈ నెల విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ ను మొదలు పెట్టాల్సి ఉంది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

కానీ చిత్ర బృందం మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు.దీనితో తెరపైకి కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత సుంకర రామబ్రహ్మం మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి.నిర్మాత ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తుంటే సురేందర్ రెడ్డి మాత్రం ఇంకాస్త టైం కావాలని అడుగుతున్నారట.

దీనితో ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు