తండ్రి ప్రేమకు దూరమైన శ్రీలీలకు బాలయ్య సినిమాతో ప్రేమను ఇచ్చారా.. అలా ఎమోషనల్ అవుతూ?

స్టార్ హీరోయిన్ శ్రీలీల( Sreeleela ) పైకి నవ్వుతూ కనిపించినా ఆమె జీవితంలో చెప్పుకోలేదని బాధ ఉంది.

శ్రీలీల చిన్న వయస్సులోనే శ్రీలీల తండ్రి వాళ్ల అమ్మతో విడాకులు తీసుకున్నారు.

తండ్రి ప్రేమకు దూరంగా పెరిగిన శ్రీలీల తాజాగా భగవంత్ కేసరి మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.భగవంత్ కేసరిలో విజ్జి పాప అనే రోల్ దొరికిందని ఈ పాత్ర చేయడం తన అదృష్టమని అన్నారు.

కొన్ని సీన్స్ లో నటించిన తర్వాత సైతం అదే మూడ్ లో ఉంటే బాలయ్య నవ్వించి మూడ్ ను మార్చేవారని ఆమె పేర్కొన్నారు.మంచి పాత్ర ఇచ్చినందుకు అనిల్ కు రుణపడి ఉంటానని భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) అందమైన కథ అని ఆమె తెలిపారు.శ్రీలీలకు రియల్ లైఫ్ లో దొరకని తండ్రి ప్రేమ రీల్ లైఫ్ లో బాలయ్య ద్వారా దొరకడం వల్లే శ్రీలీల ఎమోషనల్ అయ్యారని సీన్స్ లో నటించిన తర్వాత సైతం అదే మూడ్ లో ఉన్నానని చెప్పారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

శ్రీలీల తండ్రి దూరమైన బాధను భరిస్తూనే సినిమాలలో నటిస్తున్నారు.గతంలో శ్రీలీల తండ్రి( Sreeleela Father ) మీడియాతో మాట్లాడుతూ శ్రీలీల స్థాయిని తగ్గించేలా కొన్ని కామెంట్లు చేశారు.

Advertisement

శ్రీలీల సైతం ఇంటర్వ్యూలలో తన తండ్రి గురించి ప్రస్తావించడానికి ఇష్టపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.శ్రీలీల పారితోషికం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

శ్రీలీల ఆదికేశవ, గుంటూరు కారం( Guntur Karam ), ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలలో నటిస్తున్నారు.ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు శ్రీలీల జాబితాలో ఉన్నాయి.హీరోయిన్ శ్రీలీల వరుస విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ కు ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు