అందగా రెడీ అయ్యి బాత్ రూమ్ యాడ్ చేసిన శివజ్యోతి.. బాగా ఆడుకుంటున్న ట్రోలర్స్?

ఈ మధ్య యాంకర్ శివ జ్యోతి ప్రతి విషయంలో బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.ఆమె ఏదైనా పోస్ట్ చేస్తే చాలు బాగా ఆడుకుంటున్నారు ట్రోలర్స్.

ఎందుకంటే ఒకప్పుడు ఈమె ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే.కెరీర్ మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించిన శివ జ్యోతి ఇప్పుడు బాగా గ్లామర్ షోతో పెంచటంతో అందరూ తనపై బాగా ఫైర్ అవుతున్నారు.

అలా ప్రతి విషయంలో కామెంట్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.తాజాగా మరోసారి బాగా ట్రోల్స్ ఎదురుకుంది.

ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.కెరీర్ మొదట్లో వి6 ఛానల్ లో తీన్మార్ వార్తల్లో యాంకర్  సావిత్రిగా అందరికీ పరిచయం అయ్యింది శివ జ్యోతి.

Advertisement

అలా అందులో తన మాటలతో అందరినీ తన వైపుకు మలుపుకుంది.అలా తెలుగు రాష్ట్రాల ప్రజలతో తన పరిచయాన్ని పెంచుకున్న శివజ్యోతి తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టింది.

ఇక ఇందులో తన ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకుంది.కానీ మధ్యలోనే ఇంటి బాట పట్టింది.

ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మరో ఛానల్ లో యాంకర్ గా అడుగుపెట్టింది.అంతేకాకుండా బుల్లితెరపై వచ్చే షోస్, ఈవెంట్స్ లలో పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటుంది.

ఇక బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారింది.యూట్యూబ్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకుంది.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

ఒకప్పుడు శివ జ్యోతి అంటే అందరూ చాలా రెస్పెక్ట్ చూపించేవారు.

Advertisement

కానీ ఈ మధ్య మాత్రం ఆమెను బాగా విమర్శిస్తున్నారు.ఎందుకంటే ఒకప్పుడు శివ జ్యోతి చాలా పద్ధతిగా ఉండేది.మంచి మంచి దుస్తువులు ధరించేది.

కానీ ఇప్పుడు ఆమె అలా లేదు.ఎప్పుడైతే బిగ్బాస్ లో తన పరిచయాన్ని పెంచుకుందో ఆ షో తర్వాత నుంచి ఆమె అవతారం మొత్తం మారిపోయింది.

పొట్టి పొట్టి బట్టలు వేసి అందర్ని షాక్ అయ్యేలా చేసింది.ఇక తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను, ఫన్నీ వీడియోలు బాగా పంచుకుంటుంది.

ఇక ఈ మధ్య కూడా మరింత గ్లామర్ గా షో బాగా రెచ్చిపోతుంది.అయితే అప్పుడప్పుడు పండగల సందర్భంగా కొన్ని అడ్వటైజ్మెంట్ లు చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ చేసింది.సంక్రాంతి సందర్భంగా ఒక అడ్వర్టైజ్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అయింది.

అందులో పట్టు చీర కట్టుకొని అందంగా రెడీ అయి బాత్రూం క్లీన్ చేసే హార్పిక్ గురించి అడ్వర్టైజ్ ఇచ్చింది.  దీంతో ఆ వీడియో చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.అందంగా రెడీ అయ్యి హార్పిక్ అడ్వర్టైజ్ చేస్తావా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక మరి కొంతమంది దీనికి కూడా మేకప్ వేసుకోవాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు