పూజ గదిలో శాలి గ్రామాలను పూజిస్తున్నారా.. అయితే ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి..!

హిందూమతంలో శాలిగ్రామానికి ఎంతో విశిష్టత ఉంది.శాలిగ్రామాన్ని విష్ణుమూర్తి( Lord Vishnu ) స్వరూపంగా ప్రజలు భావిస్తారు.

శైవ సంస్కృతి ప్రకారం శివుడు ఎక్కడికి వెళ్లినా శివుని పాదాల క్రింద వచ్చిన గులకరాళ్లు శాలిగ్రామంగా మారుతాయి అని చాలామంది ప్రజలు నమ్ముతారు.మొత్తం 33 రకాల శాలిగ్రామాలు ఉన్నాయి.

వీటిలో 24 రకాల శాలిగ్రామాలు విష్ణువుకు సంబంధించినవి.దీనితో పాటు శాలిగ్రామం ఇంట్లో ఉన్న వ్యక్తికి అతని జీవితంలో బాధలు, కష్టాలు ఉండవని వాస్తు శాస్త్రం( Vastu Shastra ) చెబుతోంది.

అయితే మీ ఇంట్లో శాలిగ్రామం ఉంటే దానికి సంబంధించిన కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం.కాబట్టి శాలిగ్రామానికి సంబంధించిన కొన్ని నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Shali Villages Are Being Worshiped In The Pooja Room But These Rules Must Be Str

ఈ నియమాలను మీరు పాటించకపోతే మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు.నేపాల్లోని గండకీ నదిలో శాలిగ్రామా రాళ్లు కనిపిస్తాయి.

ఈ రాయిలో ఒక చక్రం ఉంటుంది.ఆ చక్రం ఒక పురుగు ద్వారా సృష్టించబడింది.

Shali Villages Are Being Worshiped In The Pooja Room But These Rules Must Be Str

ముఖ్యంగా చెప్పాలంటే శాలిగ్రామ్ ఈ నదిలో మాత్రమే కనిపిస్తుంది.షాలిగ్రామ్ వైభవ్ ( Shaligram Vaibhav )మతం అతిపెద్ద రూపంగా పరిగణిస్తారు.ఇది ధర్మానికి చిహ్నంగా పరిగణిస్తారు.

వాటిని పూజించడం ద్వారా ఆలోచనలు, ప్రవర్తనలో స్వచ్ఛత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.మీరు మాంసాహారం, మద్యం తీసుకుంటే పొరపాటున కూడా శాలిగ్రామాన్ని పూజించకూడదు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

వ్యాధుల బారిన పడినప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, రుతుక్రమం సమయంలో కాకుండా మీరు ప్రతి రోజు సాలిగ్రామాన్ని పూజించవచ్చు అని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.ఒకటి కంటే ఎక్కువ శాలిగ్రామాలను పూజ గదిలో ఉంచకూడదు.

Advertisement

శాలిగ్రామానికి ప్రతిరోజు పంచామృతంతో అభిషేకం చేయించాలని గుర్తుంచుకోవాలి.నెయ్యి, తేనే, పాలు, చక్కెర, స్వచ్ఛమైన నీరు వీటితో అభిషేకం చేయించిన తర్వాత పూజ చేయాలి.

శాలిగ్రామం పై గ్రంధాన్ని పూయాలి.దానిపై తులసి ఆకును ఉంచాలని గుర్తుపెట్టుకోండి.

ఒక గంధపు చెక్క ను తీసుకొని రాతిపై రుద్ది ఆ తర్వాత వచ్చిన గ్రంథాన్ని శాలిగ్రామానికి పూయాలి.

తాజా వార్తలు