విడుదల రోజే ఓటీటీ లో షారుఖ్ ఖాన్ ‘డంకీ’..కన్నీళ్లు పెట్టుకున్న నిర్మాతలు!

సుమారుగా పదేళ్ల నుండి సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడిన షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) కాస్త గ్యాప్ తీసుకొని ఈ ఏడాది ప్రారంభం లో పఠాన్ చిత్రం తో మన ముందుకు వచ్చాడు.

ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

సుమారుగా 1000 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ చిత్రం కొల్లగొట్టింది.ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇదే ఏడాది ఆయన జవాన్ చిత్రం తో మరోసారి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి, ఒకే ఏడాదిలో రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్న ఏకైక హీరో గా నిలిచాడు.

ఈ సినిమా తర్వాత ఆయన రాజ్ కుమార్ హిరానీ తో డుంకీ( Dunki) అనే చిత్రం చేసాడు.రాజ్ కుమార్ హిరానీ( Rajkumar Hirani ) అంటే తెలుగు లో రాజమౌళి ఎలాగో , హిందీ లో అలా అన్నమాట.

Shah Rukh Khan s dunki In Ott On The Day Of Its Release , Dunki ,shah Rukh

ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తూ వచ్చాయి.అలా కెరీర్ లో వంద శాతం సక్సెస్ రేట్ లో డైరెక్టర్ తో పీక్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ సినిమా చేసాడంటే ఏ రేంజ్ అంచనాలు వేరే లెవెల్ లో ఉండడం సహజం.కానీ జానర్ ప్రభావం వల్లనో ఏమో తెలీదు కానీ, ఈ సినిమాకి అనుకున్నంత హైప్ అయితే రాలేదు.

Advertisement
Shah Rukh Khan 's 'Dunki' In OTT On The Day Of Its Release , Dunki ,Shah Rukh

టీజర్, ట్రైలర్ ఇలా ఏ ఒక్కటి కూడా సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసేలా చెయ్యలేదు.అలా తక్కువ అంచనాలతోనే విడుదలైన ఈ సినిమా కి రెస్పాన్స్ కూడా డివైడ్ గానే వచ్చింది.

ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ అనుకున్న స్థాయిలో ఎమోషన్స్ పండలేదని, ఇది హిరానీ( Rajkumar Hirani ) మార్క్ కాదంటూ టాక్ వినిపించింది.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని నేడు ట్విట్టర్ లో ఒక వ్యక్తి లైవ్ షో వేసాడు.

Shah Rukh Khan s dunki In Ott On The Day Of Its Release , Dunki ,shah Rukh

సినిమా స్టార్టింగ్ టైటిల్స్ నుండి ఎండింగ్ వరకు ట్విట్టర్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసేసారు.మేకర్స్ కూడా పట్టించుకోకపోవడం తో ఆ పైరసీ ప్రింట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఇది చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాస్ పాతిక కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట.ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని పాతిక రోజుల్లో ఓటీటీ లో విడుదల చెయ్యాలి.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

అంటే జనవరి 15 వ తారీఖు లోపు ఈ సినిమా ఓటీటీ లో అందుబాటులోకి రానుంది అట.ఇలా విడుదల రోజే ఓటీటీ విడుదల తేదీ బయటకి లీక్ అవ్వడం తో నిర్మాతలు సదరు ఓటీటీ సంస్థ పై ఫైర్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు