నిషేధిత గంజాయి పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలో వట్టెంల గ్రామం వద్ద ఒడిశా రాష్టానికి చెందిన కామటి కారా అనే వ్యక్తి వద్ద నుండి సుమారు 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్టు వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్ తెలిపారు.

వివరాల లోకి వెళితే నమ్మదగిన సమాచారం మేరకు జగిత్యాల నుండి ఒక వ్యక్తి వేములవాడ కు గంజాయి తో వస్తున్నాడనే సమాచారం మేరకు వట్టెంల గ్రామం వద్ద గంజాయి కలిగిన ఒడిస్సా రాష్టానికి చెందిన కమటి ఖారా అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకొని వేములవాడ డిప్యూటీ తహసీల్దార్ ఎదుట పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.ఈ సందర్బంగా వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు లోను కావద్దు అని, తల్లి తండ్రులు పిల్లల ను గమనిస్తూ ఉండాలి అని, యువత ఇలాంటి వాటికి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తు ని నాశనం చేసుకోవద్దు అని మీ దగ్గర గంజాయి సమాచారం ఉంటే పోలీస్ వారికి తెలపాలి అని వారి వివరాలు గోప్యం గా ఉంచుతాం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా నుండి గంజాయి ని రూపు మాపాలి అని ప్రత్యేక బృందం తో తనిఖీ లు చేస్తున్నారు అని గంజాయి నిర్ములన లో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలి అని కోరారు.

Latest Rajanna Sircilla News