ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ..వీర్రాజు స్థానంలో సత్య కుమార్ ?

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును( Somu Viraraju ) తప్పించి ఆస్థానంలో మరో వ్యక్తిని నియమించాలని బిజెపి అధిష్టానం చాలా కాలం నుంచి కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే సోము వీర్రాజు మాత్రం తానే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారు.

ఆయనకు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్(Sunil Deodhar) అండదండలు ఉండడంతో, వీర్రాజు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఏపీ బీజేపీలో వీర్రాజును వ్యతిరేకించే నాయకులు ఎక్కువగా ఉండడం, ఆయనపై వైసీపీ ముద్ర పడడం, వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బిజెపిలో గ్రూపులు పెరిగిపోవడం వంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న బిజెపి అధిష్టానం ఆయనను మార్చాలని దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం.

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన వెంటనే ఏపీ బీజేపీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా బిజెపి జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ను నియమించాలని బిజెపి అధిష్టానం పెద్దలు నిర్ణయించుకున్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సత్య కుమార్ కు హై కమాండ్ పెద్దల వద్ద పలుకుబడి ఉండడం, ఆయన కూడా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని స్వీకరించాలనే ఆలోచనతో ఉండడం, ఆయనకు వీర్రాజు వ్యతిరేక వర్గం మద్దతు ఉండడం ఇవన్నీ కలిసివచ్చే అంశాలు.

Advertisement

ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు వైసిపి అనుకూల వ్యక్తి అనే ముద్ర పడటంతో పాటు, బిజెపిలోని చాలామంది నాయకులతో విభేదాలు ఉండడం, అలాగే బిజెపి మిత్రపక్షం గా ఉన్న జనసేన ను కలుపుకు వెళ్లే విషయంలో వీర్రాజు చురుగ్గా వ్యవహరించకపోవడం, ఈ విషయంలో జనసేన వర్గాలలోనూ తీవ్రమైన అసంతృప్తి ఉండడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వీర్రాజు స్థానంలో సత్యకుమార్ ను నియమించాలని అధిష్టానం పెద్దలు దాదాపుగా డిసైడ్ అయిపోయారట.ఇక సత్యకుమార్ విషయానికి వస్తే, ఏపీ బీజేపీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు.

దీంతో పాటు ఏపీలో వైసిపి ప్రభుత్వంపై సందర్భం వచ్చినప్పుడల్లా సత్య కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.దీంతో ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఏపీ బీజేపీలో గ్రూపుల గోల తగ్గుతుందనే నిర్ణయానికి బిజెపి అధిష్టానం పెద్దలు రావడంతోనే, సత్య కుమార్ వైపు వారు మొగ్గు చూపిస్తున్నారు.జులై మూడో తేదీన దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

అయితే మంత్రి వర్గం విస్తరణ తరువాతే ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం పై చోటుచేసుకోబోతోందట.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు