ఇష్టపడి చదివితే సాధించనిది అంటూ ఏది లేదని ఎల్లారెడ్డిపేట వాస్తవ్యులు వివిధ చోట్ల డాక్టర్ వృత్తి లో స్థిరపడిన డాక్టర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఎల్లారెడ్డిపేట మండల ( Yellareddypet )కేంద్రానికి చెందిన నిరుపేద దళితుడు జీడీ సాయాన్న వ్యవసాయాన్ని నమ్ముకొని కొడుకు సురేందర్ ను ప్రయోజకున్ని చేయాలని ప్రభుత్వ బడుల్లో నే ఉన్నత విద్య ను చదివించారు , తండ్రి ప్రోత్సాహం తో భవిష్యత్తులో సురేందర్ కూడా నలుగురికి ఉపయోగపడే వృత్తి ని ఎంచుకొని పట్టుదలతో ఇష్టపడి డాక్టర్ కోర్సు పూర్తి చేసి అయన డాక్టర్ పట్టా( Doctor Course ) పొంది పేద ప్రజలకు వైద్యం చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బైంసా ఏరియా ఆసుపత్రికి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు.
అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అల్లం మల్లయ్య వ్యవసాయంపై ఆధారపడి జీవానాన్ని సాగించి ఆయన కుమారుడు అల్లం సత్యనారాయణ నాశ్వాస,,,,,,, నా ధ్యాస ,,,,,,,, నా భవిష్యత్తు చదువులతల్లి సరస్వతి ని నమ్ముకొని ఓ ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత చదువులను ఇష్టపడి చదవి మూగజీవాలకు డాక్టర్ అయ్యారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో వెటర్నరీ వైద్య శాల( Veternary Hospital )లో వైద్యం అందిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండల మాజీ జెడ్పీ టి సి సభ్యులు వడ్నాల నర్సయ్య కుమారుడు శ్రీనివాస్ వైద్య వృత్తి ని ఎంచుకొని పట్టుదలతో ఇష్టపడి డాక్టర్ కోర్సు పూర్తి చేసి హైదరాబాద్ లోని ఉప్పల్ గండిమైసమ్మ టెంపుల్ సమీపంలో కార్పోరేట్ శ్రీ హాస్పిటల్ ను ప్రారంభించి మెరుగైన వైద్యం అందించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
తన స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి వచ్చినప్పుడల్లా గ్రామస్తులకు ఉచితంగానే వైద్య సేవలు అందించి గ్రామస్తుల మన్ననలను పొందుతున్నాడు.ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం డాక్టర్ స్రవంతి వాళ్ళ మమ్మీ స్వగ్రామం కూడా ఎల్లారెడ్డిపేట కావడం విశేషం.
అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి గత 40 సంవత్సరాలుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్పొరేట్ వైద్యశాలను తలదన్నే విధంగా మండల కేంద్రంలో అశ్విని హాస్పిటల్ ను నెలకొల్పి అత్యాధునిక వైద్య పరికరాలను వినియోగించి నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వివిధ చోట్ల డాక్టర్లుగా పనిచేస్తున్న డాక్టర్లు అందరికీ డాక్టర్ డే సందర్భంగా గ్రామస్తులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.