స్టేషన్ ఘన్ పూర్ టికెట్ డిమాండ్ చేస్తున్న సర్పంచ్ నవ్య..!!

తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య అందరికీ సుపరిచితురాలే.

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య( Thatikonda Rajaiah ) పై గతంలో సంచలన ఆరోపణలు చేయడం జరిగింది.

వీరిద్దరి వివాదం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.కాగా ఇటీవల కేసీఆర్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే మొదటి అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం తెలిసిందే.

ఈ లిస్టులో రాజయ్యకు టికెట్ దొరకలేదు.దీంతో ఆయన ఎంతో ఆవేదన చెందుతూ ఇటీవల కన్నీరు కూడా పెట్టుకోవడం జరిగింది.

ఇటువంటి పరిణామాల మధ్య తాజాగా సర్పంచ్ నవ్య.స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయించాలని కేసీఆర్ నీ రిక్వెస్ట్ చేస్తూ వీడియో విడుదల చేయడం జరిగింది.

Advertisement

స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య వర్గం అటు కడియం శ్రీహరి( Kadiyam Srihari ) వర్గం నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.ఈ గొడవలు లేకుండా ప్రజలకు అన్యాయం జరగకుండా.

బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ అన్న అవకాశం ఇస్తే.మీ ఆశీస్సులతో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నట్లు సర్పంచ్ నవ్య స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు