డబ్బులు లేక శృతి హాసన్ తల్లి అలాంటి కష్టాలు అనుభవించారా.. రోజుకు అంతే ఇస్తారంటూ?

తెలుగు, తమిళ భాషల్లో శృతి హాసన్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు.

శృతిహాసన్ ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే.

తెలుగులో సీనియర్ హీరోలకు జోడీగా వరుస సినిమాలతో శృతి హాసన్ బిజీ అవుతున్నారు.అయితే శృతి హాసన్ తల్లి సారిక లాక్ డౌన్ సమయంలో డబ్బులు లేక ఆర్థిక కష్టాలను అనుభవించారని సమాచారం.

తాజాగా సారిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సారిక ఏడాది పాటు యాక్టింగ్ కు దూరంగా ఉండాలని తాను అనుకున్నానని ఏడాది చివరకు ఐదేళ్లు అయిందని తెలిపారు.

కరోనా సమయంలో తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయని ఆమె చెప్పుకొచ్చారు.లైఫ్ రొటీన్ కావడంతో పాటు లైఫ్ ను వేస్ట్ చేస్తున్నానేమో అని తనకు అనిపించిందని ఆమె కామెంట్లు చేశారు.

Advertisement

డబ్బులు అయిపోయిన సమయంలో డబ్బులు కావాలంటే యాక్టింగ్ చేయాలని ఆ సమయంలో స్టేజ్ షోలు చేస్తే 2,000 రూపాయల నుంచి 2,700 రూపాయల వరకు వచ్చేవని అంతకు మించి చేయడానికి మరో అవకాశం లేదని ఆమె వెల్లడించారు.అయితే బ్రేక్ తీసుకున్న సమయం అద్భుతంగా గడిచిందని ఆమె కామెంట్లు చేశారు.నటనలోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

సారిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన మోడ్రన్ లవ్ ఇన్ ముంబై సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.లాక్ డౌన్ సమయంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని శృతి హాసన్ కూడా ఒక సందర్భంలో చెప్పారు.

సారిక, శృతి హాసన్ లకు ఆర్థిక కష్టాలు ఉన్న కమల్ సాయం చేయలేదా అని నెటిజన్ల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు