ఇల్లరికం వచ్చే భర్త కావాలంటున్న బ్యూటీ..!

బాలీవుడ్ క్రేజీ బ్యూటీ సారా అలి ఖాన్ తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈమధ్యనే అత్రాంగి రే సినిమాతో ప్రేక్షకులను అలరించిన సారా అలి ఖాన్ అందులో పెళ్లైన అమ్మాయిగా నటించింది.

ఈ సినిమా చూసి తన పేరెంట్స్ బాగా ఫీల్ అయ్యారని అన్నది.అంతేకాదు తన మదర్ ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదని.

తనకు సంబందించిన అన్ని పనులను అమ్మే చూసుకుంటుందని.తను ఎక్కడికైనా వెళ్లాలన్నా సరే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలన్నది కూడా తన అమ్మ ఇష్టమే అంటుంది సారా అలి ఖాన్.తన మదర్ తనకో ఇల్లు లాంటిదని.

తనతో ఎలాంటి విషయాన్నైనా షేర్ చేసుకుంటానని.ఒకవేళ పెళ్లి జరిగినా తనతో ఇల్లరికం వచ్చే వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని అంటుంది సారా అలి ఖాన్.

Advertisement

అయితే సారా ఇలా కామెంట్ చేయగానే బాలీవుడ్ ఆడియెన్స్ మేము ఇల్లరికం వచ్చేందుకు రెడీ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఇల్లరికం కామెంట్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సారా అలి ఖాన్.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో మంచి ఫలితాలతో దూసుకెళ్తుంది సారా అలి ఖాన్.ఆమె నటించిన అత్రాంగిరే సినిమా డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైంది.

Advertisement

తాజా వార్తలు