డార్క్ నెక్‌ ఇబ్బంది పెడుతుందా.. గంధం పొడితో చెక్ పెట్టండిలా!

డార్క్ నెక్ లేదా మెడ న‌లుపుచాలా మందిని వేధించే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

ముఖం ఎంత తెల్ల‌గా, అందంగా ఉన్నా మెడ న‌ల్ల‌గా ఉంటే అంద‌హీనంగా క‌నిపిస్తారు.

మెడ న‌ల్ల‌గా ఉంటే ఎంత ఖ‌రీదైన ఆభ‌ర‌ణాలు ధ‌రించినా ఫ‌లితం ఉండ‌దు.దీంతో మెడ న‌లుపును త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతూ వేల‌కు వేలు ఖ‌ర్చు చేస్తుంటారు.కానీ, ఇంట్లోనే కొన్ని కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సులువుగా డార్క్‌గా ఉన్న నెక్‌ను అందంగా, కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.

ముఖ్యంగా గంధం పొడి డార్క్ నెక్‌ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ స్వ‌చ్ఛ‌మైన గంధం పొడి, చిటికెడు ప‌సుపు మ‌రియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు అప్లై చేసి ఇర‌వై లేదా ముప్పై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే మెడ న‌లుపు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంది.

అలాగే ఒక బౌల్‌లో స్వ‌చ్ఛ‌మైన గంధం పొడి, నిమ్మ ర‌సం వేసి క‌లుపుకోవాలి.ఈ మిశ్రామినికి మెడ‌కు అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.

బాగా ఆరిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా మెడ‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉంటే ఖ‌చ్చితంగా మెడ న‌లుపు వ‌దిలిపోయి అందంగా, కాంతివంతంగా మారుతుంది.

ఒక ఒక బౌల్‌లో స్వ‌చ్ఛ‌మైన గంధం పొడి తీసుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రామినికి మెడ‌కు ప‌ట్టించి అర గంట పాటు ఆర‌నివ్వాలి.బాగా ఎండిన‌ త‌ర్వాత కొద్దిగా నీళ్లు చ‌ల్లి మెల్ల‌గా రుద్దుతూ మెడ‌ను శుభ్రం చేసుకోవాలి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
కాజు మిల్క్‌.. ఆరోగ్యానికి, అందానికి ఎన్ని ప్ర‌యోజ‌

ఇలా వారంలో మూడు సార్లు చేసినా డార్క్‌గా ఉన్న నెక్ తెల్ల‌గా, అందంగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు