5K డిస్ప్లేతో సామ్ సంగ్ కొత్త మానిటర్లు మార్కెట్లోకి వచ్చేశాయ్... చూడండి జరా!

సామ్ సంగ్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నిన్న సోమవారం అనగా జనవరి 2వ తేదీన ఒడిస్సీ, వ్యూఫినిటీ, మరియు స్మార్ట్ మానిటర్ లైనప్‌లలో కొత్త మోడళ్లను పరిచయం చేసింది.

అల్ట్రా - వైడ్ డిస్‌ప్లే విభాగంలో, దక్షిణ కొరియా తయారీ కంపెనీ ఒడిస్సీ నియో G9ని ఆవిష్కరించింది.

ఇది డ్యూయల్ అల్ట్రా - HD రిజల్యూషన్‌తో వచ్చిన ప్రపంచంలోని మొట్ట మొదటి సింగిల్ మానిటర్ అని విశ్లేషకులు చెబుతున్నారు.అదనంగా, సామ్ సంగ్ ఒడిస్సీ OLED G9 కర్వ్డ్ డిస్‌ప్లే మానిటర్‌ను 5,120 x 2,880 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ViewFinity S9 5K మానిటర్‌ను పరిచయం చేస్తోంది.

అయితే సామ్ సంగ్ తాజా మానిటర్‌ల ధర మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.

1.కొత్తగా ఆవిష్కరించబడిన సామ్ సంగ్ Odyssey Neo G9 గేమింగ్ మానిటర్ మోడల్ పేరు G95NC.2.7,680×2,160 పిక్సెల్‌ల రిజల్యూషన్ కలిగి వుంది.3.240Hz రిఫ్రెష్ రేట్ మరియు 32:9 యాస్పెక్ట్ రేషియో.4.57-అంగుళాల 1000R కర్వ్డ్ డిస్‌ప్లే.5.DisplayPort 2.1 మద్దతును కలిగి ఉంటుంది.

సామ్ సంగ్ Odyssey OLED G9 స్పెసిఫికేషన్స్:

1.మోడల్ నంబర్ G95SC 2.డ్యూయల్ క్వాడ్-HD 49-అంగుళాల 1800R కర్వ్డ్ డిస్‌ప్లే 3.32:9 యాస్పెక్ట్ రేషియో, 0.1ms ప్రతిస్పందన సమయం మరియు 240Hz రిఫ్రెష్ రేట్‌.4.OLED డిస్ప్లే ప్రతి పిక్సెల్‌ 1,000,000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో కలిగి వుంది.5.గేమింగ్ హబ్ ఆన్‌బోర్డ్‌తో వస్తుంది.6.Xbox క్లౌడ్ గేమింగ్ మరియు Nvidia GeForce Now క్లౌడ్‌లో గేమ్స్ సపోర్ట్.

గమనిక:

మరిన్ని వివరాలకు సామ్ సంగ్ సంబంధిత సైట్ సందర్శించగలరు.

Advertisement
వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!

తాజా వార్తలు