ఎప్పుడూ చేయని పని చేసిన సమంత.. ఏమిటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఇప్పటికే స్టార్ హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించిన సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న సమంత, దీని కోసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయాలను చేస్తోంది.ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న సామ్, దీని కోసం తొలిసారి హిందీలో తానే స్వయంగా డబ్బింగ్ చెబుతోంది.

అటు హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చస్తుండటంతో అన్ని భాషల్లో తన వాయిస్‌కు తానే డబ్బింగ్ చేప్తోంది ఈ బ్యూటీ.ఇక ఈ వెబ్ సిరీస్‌లో సామ్ తొలిసారి ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

వరుసబెట్టి సినిమాలు చేయడమే కాకుండా ఇలా వెబ్ సిరీస్‌లతోనూ తన జోరును కొనసాగిస్తుండటంతో మిగతా హీరోయిన్లు అసూయగా చూస్తున్నారు.ఇటీవల జాను సినిమాతో ప్రేక్షకులను అలరించిన సమంత, తన నెక్ట్స్ చిత్రాన్ని నాగచైతన్యతో కలిసి చేసేందుకు రెడీ అవుతోంది.

Advertisement

మరి ఈ వెబ్ సిరీస్‌లో సామ్ పాత్ర ఎలా ఉంటుంది, ఆమె తన వాయిస్‌కు తొలిసారి డబ్బింగ్ ఇవ్వడంతో అది ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

తండేల్ మూవీ సెన్సార్ రివ్యూ వివరాలు ఇవే.. ఆ సన్నివేశాలే మేజర్ హైలెట్!
Advertisement

తాజా వార్తలు