అలాంటి వాటి కోసం ఇదే సరైన సమయం.. సమంత పోస్ట్ వైరల్ ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అయితే గత కొంతకాలంగా సమంత మయోసైటిస్ అనే ఒక వ్యాధితో బాధపడుతోంది.ఈ విషయాన్ని ఆమె ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానులు ఒకసారిగా షాక్ అయ్యారు.

ఇది ఇలా ఉంటే సమంత నటించిన తాజా చిత్రం యశోద.ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ ని తెచ్చుకుంది.అంతే కాకుండా ఈ సినిమాలో సమంత తన నటనకు గాను పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.

Advertisement

అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని చేసింది.

అందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్‌కు అడ్వాన్స్‌గా విష్ చేసింది సామ్.

సమంత ఇంస్టాగ్రామ్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.మీరు చేయగలిగిన వాటినే నియంత్రించండి.

కొత్త, సులభమైన లక్ష్యాల కోసం ఇదే సరైన సమయం.

వీడియో: పాకిస్థాన్‌లో ప్రాంక్ చేసిన యువకులు.. లాస్ట్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్..?
వైరల్ వీడియో : కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..

మనకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్దేశించుకోండి.ఈ ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి.అడ్వాన్స్ హ్యపీ న్యూ ఇయర్‌ 2023 అంటూ పోస్ట్ చేసింది.

Advertisement

కాగా ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో అభిమానులు అలాగే నెటిజన్స్ సమంతకు విషెష్ చెబుతున్నారు.ఇంకొందరు మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.

మరికొందరు అభిమానులు మీరు తొందరగా కోలుకొని ఎప్పటిలాగే తిరిగి రావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు