జనవరి 7న రిలీజ్ అవుతున్న RRR సినిమాకు భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూనిట్.ఈ క్రమంలో ముంబైలో ఆదివారం సాయంత్రం రోర్ ఆఫ్ RRR ఈవెంట్ నిర్వహించారు.
ఆర్.ఆర్.ఆర్ టీం తో పాటుగా ఈ ఈవెంట్ కు గెస్ట్ గా బాలీవుడ్ కండల వీరుడు.స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అటెండ్ అయ్యారు.
RRR టీం కు తన బెస్ట్ విషెస్ చెప్పిన సల్మాన్ ఖాన్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని. అవుతుందని అన్నారు.
అంతేకాదు ఈ సినిమా తర్వాత నాలుగు నెలలు ఏ సినిమా రిలీజ్ చేయొద్దని అన్నారు.అంటే సినిమా ప్రభావం అంతగా ఉంటుందని చెప్పకనే చెప్పారు సల్మాన్ ఖాన్.
ఓ తెలుగు సినిమా రిలీజ్ కు అక్కడ బాలీవుడ్ స్టార్ హీరో ఇంతగా మాట్లాడటం గొప్ప విషయమని చెప్పొచ్చు.సినిమాలో నటించిన ఎన్.
టి.ఆర్, చరణ్ లతో పాటుగా రాజమౌళి ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు.ఇక చరణ్ ఎప్పుడు చూసినా దెబ్బలతో కనిపిస్తాడని.అతని డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అన్నారు సల్మాన్ ఖాన్.ఎన్.టి.ఆర్ గురించి కూడా చాలా బాగా మాట్లాడారు సల్మాన్ ఖాన్.