మ‌ళ్లీ మంట పెడుతున్న స‌జ్జ‌ల‌.. ఇక మానుకోరా..?

ఏపీలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేత‌లు చేప‌ట్టిన ఆందోళ‌న‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిగొచ్చింది.పీఆర్సీ సాధ‌న స‌మితితో క‌లిసి ఉమ్మ‌డి మీడియా స‌మాశం ఏర్పాటు చేశారు.

చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం ప‌రిష్కారం చూపారు.స్టీరింగ్ క‌మిటీ సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల ప్ర‌తినిధులు ప్ర‌తి అంశంపై లోతుగా విశ్లేషించారు.

అన్ని అంశాలకు వారు ఓకే కూడా అనేశారు.అంతా స‌ర్ధుకుంద‌ని అనుకునే లోపే ఉపాధ్యాయ సంఘాల‌పై స‌లహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మ‌రోసారి ఫైర్ అయ్యారు.

ఇలా చేస్తారా? ఇందేం తీరు అంటూ విరుచుకుప‌డ్డారు.చ‌ర్చ‌ల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాలు బ‌య‌ట‌కెళ్లి మ‌ళ్లీ వ్య‌తిరేకంగా మాట్లడ‌మేంట‌ని, ఇదేమి ప‌ద్ధ‌త‌ని నిల‌దీశారు.

Advertisement
Sajjala Are Burning Again He Is Not Stop , Sajjala Rama Krishan Reddy , Ycp , T

స‌మావేశంలో అన్నింటికి స‌బ‌బేన‌ని చెప్పిన ఉపాధ్యాయ సంఘాలు చ‌ర్చ‌ల‌ను త‌ప్పుబ‌ట్ట‌డం ప‌ట్ల స‌జ్జ‌ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు.ఉపాధ్యాయ సంఘాలు జోక్యం చేసుకుని విన్న‌వించ‌డం వ‌ల్లే గ్రామాల్లో హెచ్ఆర్ఏను 9శాతం నుంచి 10శాతానికి పెంచామ‌న్నారు.రూ.10వేల సీలింగ్‌ను రూ.11వేల‌కు పెంచామ‌ని వెల్ల‌డించారు.ఫిట్‌మెంట్ మ‌రింత పెంచాల‌ని కోరిన‌ప్ప‌టికి ప్ర‌స్తుత రాష్ట్ర ప‌రిస్థితులు వివ‌రించామ‌న్నారు.

స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా అంగీకరించార‌ని అన్నారు.ఫిట్‌మెంట్‌పై స‌మావేశంలోనే అభ్య‌తంరం తెలిపి ఉంటే చ‌ర్చించే వార‌మ‌ని అన్నారు.

లాస్ట్ మిన‌ట్ వ‌ర‌కు చ‌ర్చ‌ల్లో పాల్గొని అంతా ఓకే అని చెప్పి మినిట్స్‌లో కూడా సంత‌కాలు చేసిన‌ట్టు తెలిపారు.స‌మ్మె విర‌మిస్తామ‌ని చెప్పార‌ని అన్నారు.

మ‌ళ్లీ మ‌రోలా మాట్ల‌డ‌డం వెన‌కాల ఆంత‌ర్య‌మేంట‌ని, ఇది స‌బ‌బు కాద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

Sajjala Are Burning Again He Is Not Stop , Sajjala Rama Krishan Reddy , Ycp , T
భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

ఉపాధ్యాయ సంఘాలను వేరే అతీత శ‌క్తులు ప‌రోక్షంగా న‌డిపిస్తున్నాయ‌ని స‌జ్జ‌ల అనుమానాలు వ్య‌క్తం చేశారు.సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి సాధించేదేమీ లేద‌ని వ్యాఖ్యానించారు.ఇంకా స‌మ‌యం ఉంద‌ని స‌మ‌స్య‌లు ఉంటే చెప్పుకోవ‌డానికి సీఎం జ‌గ‌న్ ఆప్ష‌న్ కూడా ఇచ్చిన‌ట్టు వెల్ల‌డించారు.

Advertisement

మంత్రి వ‌ర్గ సంఘానికి ఏమైనా చెప్ప‌ద‌లుచుకుంటే చెప్పొచ్చ‌ని హిత‌వు ప‌లికారు.

తాజా వార్తలు