పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన సాయితేజ్.. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారంటూ?

టాలీవుడ్ ప్రముఖ లేడీ కమెడియన్ పావలా శ్యామల ( Pavala Syamala )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఒకప్పుడు దాదాపు 300 కి పైగా సినిమాలలో నటించి లేడి స్టార్ కమెడియన్, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది పావలా శ్యామల.

అయితే సినిమాలలో నటించినన్ని రోజులు సెలెబ్రిటీగా ఒక వెలుగు వెలిగిన పావలా శ్యామల ప్రస్తుతం తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తోంది.ఇంకా చెప్పాలంటే ఆమె పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు.

ఇప్పుడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

Sai Dharam Tej Helps Senior Comedian Pavala Shyamala, Sai Dharam Tej, Help, Sen

ఆమె దిన పరిస్థితి చూసి ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు ఆమెకు సహాయం చేసిన విషయం తెలిసిందే.తాజాగా హీరో సాయి ధరంతేజ్( Sai Dharam Tej ) ఆమెకు ఆర్థిక సహాయం చేశారు.లక్ష రూపాయలను ఆమెకు అందజేశారు.

Advertisement
Sai Dharam Tej Helps Senior Comedian Pavala Shyamala, Sai Dharam Tej, Help, Sen

ఈ సందర్భంగా కొంచెం ఎమోషనల్ అయ్యారు పావలా శ్యామల.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

మా అమ్మాయికి ఆపరేషన్‌ అయినప్పుడు సాయిధరమ్‌ తేజ్‌ నాకు ఫోన్‌ చేశారు.ధైర్యం చెప్పారు.

వచ్చి కలుస్తానని అన్నారు.చాలా రోజులైపోయింది.

నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను.కానీ, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు ఆయనకు నా ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది పావలా శ్యామలా.

Sai Dharam Tej Helps Senior Comedian Pavala Shyamala, Sai Dharam Tej, Help, Sen
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అనంతరం ఆమె సాయి ధరమ్‌ తేజ్‌తో వీడియో కాల్‌ లో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు.ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.చనిపోదామనుకున్నాను.

Advertisement

సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు అని కన్నీళ్లు పెట్టుకున్నారు.అప్పుడు సాయి ధరంతేజ్ మాట్లాడుతూ.

మీరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే కష్టంగా ఉంది.ఏడవకండి అంటూ ఆమెను ఓదార్చారు.

తాజా వార్తలు