CM Jagan : ఎన్నికల తరువాత విశాఖ నుంచే పాలన..: సీఎం జగన్

ఏపీలో విశాఖ రాజధాని వ్యవహారంపై సీఎం జగన్( CM Jagan ) కీలక వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల తరువాత విశాఖ( Visakhapatnam ) నుంచే పరిపాలన చేస్తామని సీఎం జగన్ అన్నారు.

మళ్లీ గెలిచి వచ్చాక విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు.విశాఖ అభివృద్దికి కట్టుబడి ఉన్నానన్న సీఎం జగన్ అమరావతి రాజధానికి తాము వ్యతిరేకంగా కాదని తెలిపారు.

ఈ క్రమంలోనే అమరావతి( Amaravati ) శాసన రాజధానిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు.అమరావతిలో యాభై వేల ఎకరాలే ఉందన్న ఆయన అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

అదేవిధంగా విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని చెప్పారు.విశాఖను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు