బాలీవుడ్ ను హడలిస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. అక్కడి వారికీ హార్ట్'ఎటాక్' తెప్పిస్తుందిగా..

టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న రాజమౌళి ఏ సినిమా చేసిన అది ట్రెండ్ సెట్ చేసే విధంగానే ఉంటుంది.ఆయన ప్రతి సినిమా ఒక ప్రయోగమే.

ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడు సినిమా చేసిన అందులో పర్ఫెక్షన్ ఉంటుంది.ఈయన మన తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కు మార్చేశాడు.

దేశం మొత్తం మన సినిమాల వైపే చూస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మన సౌత్ సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద విలవిలా లాడిపోతున్నాయి.

ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే అంతగా ఆసక్తి చూపని అక్కడి ప్రేక్షకులు సైతం మన సినిమాల కోసం ఎదురు చుస్తున్నారు.మన సినిమాల రిలీజ్ డేట్ లను చూసి హిందీ మేకర్స్ వాళ్ళ సినిమాల రిలీజ్ డేట్ లను మార్చుకుంటున్నారు.

Advertisement

ఎందుకంటే సౌత్ సినిమాలతో పోటీగా వస్తే అవి మన ధాటికి తట్టుకోలేక చేతులు ఎత్తేస్తున్నాయి.అయితే ఇలా మన సౌత్ మూవీలు వాళ్ళ సినిమాలపై ఆధిపత్యం చెలాయించడం వాళ్లకు మింగుడుపడని విషయంగా మారింది.

ఇంతకు ముందు 83 సినిమా పుష్ప ధాటికి నిలవలేక పోయింది.ఇక కెజిఎఫ్ వంటి భారీ బడ్జెట్ సినిమా వస్తుందని తెలిసి లాల్ సింగ్ చద్దా వెనక్కి తగ్గింది.ఇక ఇప్పుడు దేశమంతటా ఆర్ ఆర్ ఆర్ మ్యానియా నడుస్తున్న విషయం తెలిసిందే.

విడుదల వరకు టెన్షన్ పెట్టిన కూడా ఆ తర్వాత మాత్రం అక్కడ కూడా తన మ్యానియా చూపిస్తూ ఆరు రోజుల్లోనే నార్త్ లో 120 కోట్లకు పైగా వసూళ్లు చేసి దూసుకు పోతుంది.

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రభావాన్ని కూడా ఈ సినిమా తగ్గించింది.ఇప్పుడు కొత్తగా రావాలి అనుకునే సినిమాలపై కూడా ఈ సినిమా ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది.ఈ రోజు జాన్ అబ్రహం స్వీయ నిర్మాణంలో రూపొందిన ఎటాక్ సినిమా రిలీజ్ అవ్వనుంది.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

అయితే ఈ సినిమాకు ఆర్ ఆర్ ఆర్ హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది.మొన్నటి వరకు ధైర్యంగానే కనిపించిన ఇప్పుడు మాత్రం ఈ సినిమ మెజారిటీ జనాలు ఆర్ ఆర్ ఆర్ ను ఇష్టపడుతుంటే ఈ సినిమా మేకర్స్ ను కలవరపాటుకు గురిచేస్తుందట.

Advertisement

అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు.మొదటి వారం నెట్టుకొచ్చిన రెండవ వారం మాత్రం కష్టమే అంటున్నారు క్రిటిక్స్.మరి మన సినిమా మ్యానియా ఎప్పటి వరకు చూపిస్తుందో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు