స్ట్రెచ్ మార్క్స్ ను ఈజీగా నివారించే రోజ్ మేరీ ఆయిల్..ఎలా వాడాలంటే?

ప్ర‌స‌వం త‌ర్వాత మ‌హిళ‌లంద‌రినీ ఇబ్బంది పెట్టే కామ‌న్ స‌మ‌స్య `స్ట్రెచ్ మార్క్స్`.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో చ‌ర్మం సాగ‌డం వ‌ల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్ప‌డ‌తాయి.

ఇవి డెలివ‌రీ త‌ర్వాత మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తాయి.దాంతో చ‌ర్మం చూసేందుకు చాలా అస‌హ్యంగా, ఇబ్బందిక‌రంగా ఉంటుంది.

ఈ నేప‌థ్యంలోనే వాటిని త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే స్ట్రెచ్ మార్క్స్‌ను నివారించి సాగిన చర్మాన్ని టైట్‌గా మార్చ‌డంలో రోజ్ మేరీ ఆయిల్ అద్భుతంగా సహాయప‌డుతుంది.

మ‌రి ఈ ఆయిల్‌ను ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ రోజ్ మేరీ ఆయిల్‌, మూడు స్పూన్ల గ్రీన్ టీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌భావిత ప్రాంతంలో అప్లై చేసి కాసేపు మ‌ర్ద‌నా చేసుకోవాలి.ఇలా రాత్రి నిద్రించే ముందు చేసి.

ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే క్ర‌మంగా స్ట్రెచ్ మార్క్స్ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అలాగే రోజ్ మేరీ ఆయిల్‌, తేనె కాంబినేష‌న్‌తోనూ స్ట్రెచ్ మార్క్స్ ను ఈజీగా నివారించుకోవ‌చ్చు.ఒక గిన్నెలో ఒక స్పూన్ చ‌ప్పున రోజ్ మేరీ ఆయిల్‌, తేనె వేసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట పూసి కాసేపు స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో మ‌సాజ్ చేసుకోవాలి.గంట అనంత‌రం కూల్ వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

ఇలా రోజూ చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

Advertisement

ఇక రోజ్ మేరీ ఆయిల్‌ను డైరెక్ట్‌గా కూడా అప్లై చేయ‌వ‌చ్చు.ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు రోజ్ మేరీ ఆయిల్‌ను చేతిలోకి తీసుకుని ప్ర‌భావిత ప్రాంతంలో అప్లై చేసి మ‌ర్ద‌నా చేయాలి.ఉద‌యాన్నే నీటితో వాష్ చేయాలి.

ఇలా చేస్తే స్ట్రెచ్ మార్క్స్ పోయి సాగిన చర్మం టైట్‌గా మారుతుంది.

తాజా వార్తలు