శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృత

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.

అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‎ఫ్లో 3,85,530 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 4,43,293 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది.జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది.

Advertisement

ముందు జాగ్రతగా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుందని వారు వెల్లడించారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు