దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడనుందా?

ప్రపంచ దేశాలలో బియ్యం ఉత్పత్తులలో అగ్రగణ్య దేశముగా భారత్( India 0 కు పేరు ఉంది.

దాదాపు బియ్యం ఉత్పత్తుల్లో 50% వాటాను భారత్ కలిగి ఉండటం ద్వారా ప్రపంచానికి అతిపెద్ద సరఫరాదారుగా భారత్ ఉంది.

అయితే ఇప్పుడు బారత దేశం తీసుకున్న ఒక నిర్ణయం తాలూకు ప్రభావం దాదాపు 140 దేశాలపై పడనుందని తెలుస్తుంది .బాస్మతి యేతర బియ్యం ఎగుమతు లపై( Rice Export ) నిన్న భారత ప్రభుత్వం నిషేధం విధించింది.ఇది అమెరికాలోని స్థిరపడిన ఎన్నారై లను ఆందోళన గురి చేసింది.

ఈ ప్రకటన వెలువడగానే అక్కడ సూపర్ మార్కెట్లపై భారతీయ ఎన్నారైలు మూకుమ్మడిగా దాడి చేసినంత పని చేశారట .వీరి దెబ్బకి రెండు రోజుల్లోనే అక్కడ బియ్యం ధరలు రెండు మూడు రెట్లు పెరిగాయట .

Rice Export Ban Leads To Panic Buying Among Telangana, Andhra Nris,global Food C

అయితే ఈ పరిస్థితి కారణమేమిటా అని గమనిస్తే అంతర్జాతీయంగా వస్తున్న భౌగోళిక , రాజకీయ మార్పులలో భాగంగా బియ్యం ధరలు అంతర్జాతీయం గా విపరీతంగా పెరుగుతూ ఉండటంతో భారతీయ వ్యాపార వే త్త లు వాటి ఎగుమతి పై విపరీతంగా దృష్టి పడుతున్నారు.దాంతో దేశీయంగా బియ్యం ధరలు( Rice Price ) విపరీతంగా పెరుగుతున్నాయి.ఇప్పటికే కూరగాయ ధరలు విపరీతంగా పెరిగిపోవడం తో సామాన్యుడిపై అధిక భారం పడుతుంది.

Advertisement
Rice Export Ban Leads To Panic Buying Among Telangana, Andhra NRIs,Global Food C

ఇప్పుడు బియ్యం ధరలు కూడా ఆకాశానికి అంటితే ద్రవ్యోల్బణం( Inflation ) విపరీతంగా పెరుగుతుందని అంతిమంగా అది ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీస్తుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

Rice Export Ban Leads To Panic Buying Among Telangana, Andhra Nris,global Food C

బియ్యం ధరలు ఇప్పటికే 10 శాతం వరకు పెరిగాయని వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందన్న అంచనాల నడుమ భారత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది.ఈ నిర్ణయం విదేశాల్లో స్థిరపడిన భారతీయ పౌరులకు ఇబ్బంది కలిగించే అంశమే అయినప్పటికీ దేశ పౌరుల ఆహార భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.నిజానికి పౌరుల ఆహార భద్రతకు బారతదేశం చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది.

తమ ఫుడ్ కార్పొరేషన్ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఒక నాలుగు సంవత్సరాలకు సరిపడా బియ్యం నిల్వలను ఎప్పుడు సిద్ధంగా ఉంచుకుంటుందని తెలుస్తోంది, అయితే అంతర్జాతీయ పరిస్థితుల్లో వస్తున్న మార్పులు కారణంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగితే దేశీయ వ్యాపారులు ఎగువతులపై( Ban on Rice Export ) పూర్తిస్థాయిలో దృష్టి పెడితే అది దేశీయ లభ్యతకు ఇబ్బంది కలుగుతుందని ఊహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగానే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది మరి విదేశీ విదేశాల్లో స్థిరపడిన భారతీయుల కోసం ఈ విషయం లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు