ఇటీవలే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణ కు సంబంధించిన అనేక రాజకీయ అంశాలపై వారిరువురు చర్చించుకున్నారు.
అలాగే తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను ఏ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తాను అనే విషయాలపైన రాధాకృష్ణ తో చర్చించారు.అయితే రాధాకష్ణ ను రేవంత్ కలవడం లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు.
టిడిపి లో యాక్టివ్ గా రేవంత్ రెడ్డి ఉండేవారు.
అలాగే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా రేవంత్ రెడ్డికి పేరు ఉంది.
దీంతో సహజంగానే రాధాకృష్ణకు రేవంత్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే తాజాగా వీరి భేటీలో ఆసక్తికరమైన విషయం పై చర్చ జరిగింది.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు పై రాధా కష్ణ , రేవంత్ రెడ్డి మధ్య చర్చ జరిగిందిలోకేష్ కోసం తాను ఎంత తిరిగానో తెలుసా అంటూ రాధాకృష్ణ మాట్లాడగా, గట్టిగా తిప్పమనండి అన్న నిజంగా అంటూ రేవంత్ మాట్లాడారు.
తెలంగాణలో పరిస్థితి ఏమైందంటే ఆంధ్రజ్యోతి , టీవీ 5 మీడియా అంతా ఇక్కడ కెసిఆర్ కంట్రోల్ లోనే ఉంది.మిగతా వాళ్ళు ఎవరు నీకు కవరేజ్ఇవ్వట్లేదు.

ఏపీ లో ఆంధ్రజ్యోతి టీవీ 5 తప్ప ఎవరు లోకేష్ ను వదలట్లేదు.దానిని కొంత కంట్రోల్ చేసాం అంటూ రాధాకృష్ణ వీడియోలు ప్రస్తావించారు.దీనికి సమాధానంగా రేవంత్ స్పందించారు.లోకేష్ ను ఎంత గ్రౌండ్ లో తిరిగితే అంత ప్రజల్లో ఫేమ్ అవుతాడు అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.లోకేష్ తో ఎక్కువ నేను మాట్లాడలేదని రాధాకృష్ణ చెప్పగా అవును ఈ విషయం నన్ను కూడా అడిగావని రేవంత్ సమాధానం చెప్పారు ఇంకా లోకేష్ కు సంబంధించిన అనేక అంశాలపై వీరు ఇరువురు చర్చించారు.రాధాకృష్ణ రేవంత్ రెడ్డి అంతర్గతంగా మాట్లాడుకున్న మాటలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది.
అయితే ఆ వీడియోలో లోకేష్ ను ఉద్దేశించి రాధాకృష్ణ పదే పదే వాడు వీడు అని వ్యాఖ్యానించడం పై టీడీపీ నాయకులు కాస్త ఇబ్బంది పడుతున్నారట.