బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకం.. !

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది.ఎన్నో పైరవీలు, అలకలు.

ఈ పీసీసీ పదవి కోసం ఇన్నాళ్లుగా మిగతా నేతలు పడ్ద ఆరాటం నేటితో ముగిసింది.ఇకపోతే ఎప్పటి నుండో తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్ది అయితే బాగుంటుదనే అభిప్రాయం ఉన్నా కొందరు నేతలు చేసిన రాజకీయాల వల్ల ఇంత కాలం ఈ పదవి ఎవరికి కట్టబెట్టాలనే అంశం తెరవెనక కొత్త రాజకీయాలకు ఊపిరి పోసిందట.

ఇక ఎందరు ఎన్ని రకాలుగా రేవంత్ రెడ్దికి ఈ పదవి దక్కకుండా అడ్దుపడ్డా చివరికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది.ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఇందులో కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ను నియమించగా, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబాని, దామోదర్‌ రెడ్డి, మల్లు రవి, పోడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌ రెడ్డి, రాజేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, జావీద్‌ అమీర్‌ లను కాంగ్రెస్ అధిష్ఠానం ఫైన‌ల్ చేసింది.

Advertisement
సుకుమార్ ఇక మీదట చేసే మూవీస్ పుష్ప 2 కి మించి సినిమాను చేయాల్సిన అవసరం ఉందా..?

తాజా వార్తలు