రివ‌ర్స్ లిస్టు త‌యారీ ప‌నిలో బాబు... ! ఎందుకంటే ?

ఏపీ టీడీపీ అధినేత‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో ముందుకుసాగుతున్నాడు.

సంక్ష‌భం నుంచి సంక్షేమం దిశ‌గా అడుగులు వేయ‌డంలో ఆయ‌న దిట్ట‌.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ విష‌యంలో బాబుపై పెద్ద ప‌ని ప‌డింద‌ట‌.దాదాపు 90 శాతంమందిని మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించాల‌ని జ‌గ‌న్ త‌ల‌మున‌క‌ల‌వుతున్నారు.

Reverse List Ready To Be Launched Babu Because Ap Politicas, Nara Chandrabab

ఈ లెక్క‌న 20మందికి పైనే మాజీలు అవుతారు.కొత్త ప‌ద‌వుల‌తు ఆశిస్తున్న వారిలో చాలామందికి ద‌క్క‌క‌పోవ‌చ్చు.

వీరు అస‌మ్మ‌తి సెగ ర‌గిలించొచ్చు.ఈ నేప‌థ్యంలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అనేది జ‌గ‌న్‌కు క‌త్తిమీద సాము వంటిందే.

Advertisement

ఏదైనా తేడా కొడితే మొద‌టికే మోసం వ‌స్తుంది.ఇదే విష‌యంపై విప‌క్ష నేత బాబు ఫోక‌స్ పెట్టార‌ట‌.

మంత్రి ప‌ద‌వులు ఆశించే వారి ఎంత‌మంది ఉన్నారు ? జిల్లాల వారీగీ ఎంత‌మంది ఆశావ‌హులు ఉన్నార‌నే లిస్ట్ త‌యారీ చేసే ప‌నిలో బాబు ఉన్నార‌ట‌.అంటే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఇలా జ‌ర‌గ‌గానే అలా ఎంత‌మంది రివ‌ర్స్ అవుతారు ? దానిని రాజ‌కీయ అవ‌కాశంగా ఎలా మ‌లుచుకోవాల‌నే ప‌నిలో బాబు ఉన్నార‌ట‌.ఒక‌వేళ వైసీపీలో ఆగ్ర‌హ‌జ్వాల‌లు చెల‌రేగితే టీడీపీ సొమ్ము చేసుకోవ‌డానికి బాబు కూడా సిద్ధంగా ఉన్నాడ‌ని స‌మాచారం.

మ‌రోవైపు పీకే టీం స‌ర్వే ప్ర‌కారం.వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీలో క‌నీసం 50మంది దాకా ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు ద‌క్క‌వ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

అయితే మంత్రివ‌ర్గంలో వైసీపీ ఆశావ‌హుల‌కు అవ‌కాశం రాకుంటే పార్టీ వీడి బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి కూడా ఉంటుంది.ఇలా అన్ని కోణాల్లో టీడీపీ లెక్క‌లేసుకుంటూ అస‌మ్మ‌తి సెగ లిస్ట్ త‌యారీ ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని తెలిసింది.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?

మొత్తంగా వైసీపీలో రెండు ర‌కాలుగా అస‌మ్మ‌తి నెల‌కొనే అవ‌శారం ఉంద‌ని టీడీపీ భావిస్తోంద‌ని స‌మాచారం.మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అనంత‌రం అలాంటి వారిని చేర‌దీసేందుకు ఇప్ప‌టి నుంచే లిస్ట్ ప్రిపేర్ చేయించ‌డం చ‌ర్చ‌ణీయాంశంగా మారుతోంది.

Advertisement

మొత్తంగా బాబు త‌న పార్టీని చ‌క్క‌బెట్టుకుంటూనే ప్ర‌త్య‌ర్థి పార్టీలో లుక‌లుక‌లు మొద‌లైతే బాబు రాజ‌కీయ మార్క చూపించే ప‌నిలో ప‌డ‌తార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.ఇక టీడీపీ క‌స‌ర‌త్తు ప‌ట్ల వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

తాజా వార్తలు