Revanth : రేవంత్ ఒక్కడే కాదు గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో !

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చీమ చిటుక్కుమన్నా దానికి వంద విషయాలు జోడించి వార్తలు ప్రచారం చేస్తున్నారు.

ఇప్పుడు కేసీఆర్( KCR ) తుంటి విరగడం, దానికి రేవంత్ యశోద హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం తో ఈ వార్తల జోరు పెరిగింది.

మాములుగా వీరిద్దరూ రాజకీయాల్లో ప్రత్యర్థులు.అంటే దాని అర్ధం వీరు ఇద్దరు ఎదురుబడితే కత్తులతో పొడుచుకుంటారని కాదు కదా.అయితే సోషల్ మీడియా లో మాత్రం ఈ వార్త మరోలా సర్క్యులేట్ అవుతుంది.కానీ గతంలో అంటే సోషల్ మీడియా లేని రోజుల్లో ఇలా అంత జరగలేదు.

అలాగే రాజకీయ ప్రత్యర్థులు క్లిష్ట సమయాల్లో పరామర్శలు చేసుకున్నారు.మరి జరిగిన కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత( Jayalalithaa ) తన చివరి రోజుల్లో ఆసుపత్రిలో ఉంటె ఆ టైములో ప్రతిపక్షం లో ఉన్న కరుణానిధి( Karunanidhi ) తరపున అతడి కుమారుడు స్టాలిన్ అపోలో హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి డాక్టర్లతో ఆమె బాగోగుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సమయంలో వైస్ రాజశేఖర్ రెడ్డి( Rajasekhar Reddy ) విమాన ప్రమాదంలో చనిపోయిన సంగతి మనందరికి తెలిసిందే.ఆ టైం లో రాష్ట్రం అంత అల్లకల్లోలంగా ఉంది.

Advertisement

అప్పుడు స్వయంగా చంద్రబాబు( Chandrababu ) గారు వైస్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఓదార్చడం జరిగింది.ఇలా సీఎం గా ఉన్న వారు తగ్గిన, ప్రతిపక్షంలో ఉన్నవారు ఒక అడుగు ముందుకు వెనక్కు వేసి మాట్లాడుకున్న కొంపలు మునిగిపోయే సమస్యలు ఏమి జరగవు.

కేవలం వీరు మాత్రమే కాదు మాజీ ఉమ్మడి సీఎం మరియు నాటి హీరో ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చాక కృష్ణ మరియు అక్కినేని వంటి వారితో విభేదాలు వచ్చాయి.మొదటి నుంచి అక్కినేని తో ఎన్టీఆర్ కి సరైన స్నేహం లేదు.టాలీవుడ్ ని రెండు ముక్కలు చేసి ఎవరికీ వారు పెంచి పోషించేవారు.

ఇక ఎన్టీఆర్ సీఎం గా ఉన్న టైం అక్కినేని అందరిని చెన్నై నుంచి హైదరాబాద్ కి రమ్మని పిలుపు ని ఇవ్వగా ఆ టైం లో ఎన్టీఆర్ ని కలుపుకోలేదు అని ఆయన కొన్ని రోజులు అలక వహించారు.ఇక రవీంద్రభారతి లో ఎదో మీటింగ్ లో అక్కినేని సీఎం ని ఉద్దేశించి ఎదో పద్యం చెప్తే దానికి ఆగ్రహంతో ఎన్టీఆర్ రవీంద్రభారతి లో అన్ని ప్రోగ్రాం వీడియో లు తనకు రావాలని హుకుం జారీ చేసారు.

దాంతో అక్కినేని త్యాగరాయ సభల్లో మాత్రమే మీటింగ్ పెట్టుకుంటానని కొన్నేళ్లు అలక వహించారు.

బీజేపీ ఎమ్మెల్యేల అసంతృప్తి కారణం ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు