ఈ వ్యూహంతో బీజేపీకి చెక్ పెట్టనున్న రేవంత్

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటల దాడి చేస్తూ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణం చేస్తూ ప్రతి ఎన్నికలో గెలిచే దిశగా వ్యూహ రచన చేస్తోంది.

కూటముల కుమ్ములాటలతో కాలం గడిపే కాంగ్రెస్ ప్రజల సమస్యలపై, ప్రభుత్వ పనితీరుపై విమర్శించలేక విఫలమవడంతో ప్రజలు దుబ్బాక ఉప ఎన్నికలో, గ్రేటర్ ఎన్నికలో ఓటమి రుచి చూపించిన విషయం తెలిసిందే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతున్న పరిస్థితులలో కాంగ్రెస్ ను ప్రజలు మర్చిపోతారనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పేరిట పాదయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే.అయితే కాంగ్రెస్ తరపున ఒక్కడిగా పోరాటం చేయాల్సి రావడంతో బీజేపీ చెక్ పెట్టేలా తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు.

తాను పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాలలో సంబంధించిన పెద్ద పెద్ద నాయకులను కాంగ్రెస్ లోకి తీసుకువస్తూ ప్రజలలో వారిని ఒకరిగా చేస్తూ అక్కడ ఉన్న స్థానిక బీజేపీ నేతలను మానసికంగా దెబ్బ తీసి కాంగ్రెస్ ను సంస్థాగతంగా పటిష్టపరచాలన్నది రేవంత్ వ్యూహం.చూద్దాం ఈ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మెరుగు పడి బీజేపీకి పోటీగా అవతరిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు