Revanth Reddy : అవినీతి పై వరుస ఎంక్వైరీలు .. బీఆర్ఎస్ ను వణికించేస్తున్న రేవంత్ 

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలికి తీసి ప్రజల ముందు బీఆర్ ఎస్ నేతలను దోషులుగా చూపించేందుకు,  గత ప్రభుత్వంలో ఏ స్థాయిలో ప్రజాధనం లూటీ అయ్యింది అనేది లెక్కలతో సహా వివరించేందుకు కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రభుత్వం నిర్ణయించుకుంది.

దీనిలో భాగంగానే గత ప్రభుత్వంలో వివిధ శాఖలలోను,  సాగునీటి ప్రాజెక్టు లలోనూ, పెద్ద ఎత్తున చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను బయటకు తీసే పనిలో నిమగ్నమైంది.

గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన నేతలతో పాటు,  ఈ అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ అధికారులపైన చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది.  ఈ మేరకు వివిధ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తున్నారు.

దానికి అనుగుణంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు , వారిపై కేసులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ వ్యవహారాలన్నిటితో బీఆర్ఎస్( BRS ) కీలక నేతలతో పాటు,  అప్పట్లో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఆందోళన చెందుతున్నారు ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా,  ఎన్ని విచారణలు చేయించినా,  తాము బెదిరేది లేదంటూనే ప్రస్తుత పరిణామాలను తలుచుకుని ఆందోళన చెందుతున్నారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల సమయంలోనే అరు శాఖలలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించారు . మేడిగడ్డ ప్రాజెక్టులు ( Medigadda projects ) పిల్లర్లు కుంగిన ఘటన తో మొదలైన విచారణ వివిధ శాఖల కు చేరింది.  నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆరోపణలతో రిటైర్డ్ ఈ ఎన్ సి మురళీధర్ రావు ,మేడిగడ్డ ఈఎంసి నల్ల వెంకటేశ్వర్లను విధుల నుంచి టెర్మినేట్ చేసింది.

Advertisement

కాలేశ్వరం ప్రాజెక్టులో( Kaleshwaram project ) అవినీతి పై వైట్ పేపర్ విడుదల తో పాటు , ఎమ్మెల్యేలను సందర్శనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువెళ్ళింది.

ఆ తరువాత ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు .ఇక హెచ్ఎండిఏ లో స్థిరాస్తి వ్యవహారాలపై శివ బాలకృష్ణతో పాటు,  ఆయన బంధువులు నివాసాలు  , ఆఫీసులలోనూ సోదాలు జరిపారు.దాదాపు 100 కోట్లకు పైగా విలువైన భూములు , పత్రాలు , నగదు ,బంగారు ఆభరణాలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు .ఆ తరువాత ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది.ఇక గొర్రెల పంపిణీ లో అక్రమాలపై పోలీసులకు వచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తదుపరి దర్యాప్తును ఏసీబీకి అప్పగించింది.

  బాధితులను విచారించి వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ పశుసంవర్ధక శాఖలో పనిచేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేశారు.అలాగే ఇటీవల ఎలైట్ వైన్ షాపుల పేరుతో ప్రత్యేక జీవో ఇచ్చి వ్యాపారం చేసుకునేందుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వ్యవహారం పైన ఎక్సైజ్ , జిఎస్టి , కమర్షియల్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు .లిక్కర్, వైన్ షాప్ నిర్వహణలో బీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందని , అప్పుడు సర్వీసులో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి సహకరించారనే ఆరోపణలు పైన దాదాపు 100 కోట్ల మేర పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం తదితర అంశాలపై 11 అంశాల పైన విచారణ చేయించారు.ఇలా అన్ని విషయాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందనే విషయాన్ని లెక్కలతో సహా రుజువు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవడం వంటి పరిణామాలు బీఆర్ఎస్ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు