గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Governor Tamilisai ) పున: పరిశీలన చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియమకాలకు సంబంధించి దాసోజ్ శ్రవణ్, కుర్రా సత్యనారాయణ( Dasoju Sravan Kumar And Kurra Satyanarayana ) వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా వీరిద్దరినీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt )లోని మంత్రవర్గం సిఫారసు చేయగా గవర్నర్ తిరస్కరించారు.ఈ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం గత విచారణలో తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.







