బిగ్ బాస్ విన్నర్ రేవంత్ ఎంత గెలుచుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బిగ్ బాస్ సీజన్ 6 తాజాగా ఆదివారంతో ముగిసింది.105 రోజులపాటు జరిగిన ఈ షో ఎట్టకేలకు ముగిసింది.

అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ముందుగా ప్రేక్షకులు ఊహించిన విధంగానే రేవంత్ విన్నర్గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే బిగ్ బాస్ హౌస్ కి రేవంత్ ఎంట్రీ ఇచ్చిన మొదట్లో రెండు వారాల్లోని ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోతాడు అని అనుకున్నారు.అనుకున్న విధంగానే ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం రేవంత్ విన్నర్ అయిన విషయం తెలిసిందే.

కానీ లాస్ట్ లో నాగార్జున ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.ఓటింగ్ ప్రకారం చూసుకుంటే శ్రీహాన్ కి అత్యధికంగా ఓట్లు వచ్చినట్లు చెప్పి శ్రీహాన్ కి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున.

దాంతో శ్రీహాన్ తో పాటు అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇక టాప్ 2 లో ఉన్న శ్రీహాన్ ఊహించని విధంగా తొందరగా నిర్ణయం తీసుకోవడంతో లెక్కలన్నీ మారిపోయాయి.

Advertisement

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రేవంత్ బిగ్ బాస్ షోలో విన్నర్ గా ఎంత గెలుచుకున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.కానీ ప్రైజ్ మనీ మాత్రం చాలా దారుణంగా కోతపడటం గమనార్హం.

ప్రైజ్ మనీ 50 లక్షలు 40 లక్షలు దక్కించుకోవడంతో మిగిలిన 10 లక్షలు రేవంత్ కి అప్పచెప్పారు.మరి బిగ్ బాస్ విన్నర్ కి ఏమేమి వచ్చాయి అన్న విషయానికి వస్తే.

బిగ్బాస్ సీజన్ 6 ట్రోఫీతో పాటు పది లక్షల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు రేవంత్.

దాంతో పాటుగా సువర్ణభూమి వారి 650 గజాల ఫ్లాట్ కూడా దక్కించుకున్నాడు.ఏకంగా సువర్ణభూమి వారే విన్నర్ కి ఈ గిఫ్ట్ ని ప్రకటించారు.ఆ ల్యాండ్ విలువ దాదాపుగా 30 లక్షలు ఉంటుందని అంచనా.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

అలాగే 10 లక్షలు విలువైన బ్రెజా కారుని మారుతి సుజుకి వారు ప్రకటించారు.అలా మొత్తం కలిపి రేవంత్ కి 50 లక్షల వరకు అందుకున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

కానీ ప్రైజ్ మనీ 50 లక్షలు రేవంత్ కి పది లక్షలు దక్కడం విచారకరం.

తాజా వార్తలు