లైవ్ రిపోర్టింగ్ పేరుతో వింతగా ప్రవర్తించిన రిపోర్టర్

లైవ్ రిపోర్టింగ్ పేరుతో పాకిస్థాన్ కు చెందిన ఒక రిపోర్టర్ వింతగా ప్రవర్తించాడు.

వరద నీటిలో మునిగి తేలుతూ లైవ్ రిపోర్టింగ్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు వరద రిపోర్టింగ్ ఇవ్వాలన్న ఉద్దేశ్యం తో ఆ రిపోర్టర్ చేసిన పనికి కొందరు నైస్ రిపోర్టింగ్ అంటూ కామెంట్ చేస్తుండగా, మరికొందరేమో మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.అయినా పాక్ రిపోర్టర్స్ ఈ విధంగా వింతగా ప్రవర్తించడం ఇదేమీ కొత్తేమీ కాదు.

మొన్నామధ్య పాకిస్థాన్ లో ఒక రిపోర్టర్ గాడిద పై ఎక్కి రిపోర్టింగ్ చేస్తూ బొక్క బోర్లాపడి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే.అలానే మరొక రిపోర్టర్ కూడా లైవ్ స్ట్రీమింగ్ పేరుతో ఇలానే వరద నీళ్ళల్లో నిలబడి మరీ రిపోర్టింగ్ చేసి జర్నలిస్ట్ లోకాన్నే ఆశ్చర్యానికి గురిచేశాడు.

దానికి సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇక ఇప్పుడు తాజాగా మరో పాకిస్తానీ రిపోర్టర్ కూడా పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలో పీకల్లోతు కు వచ్చిన వరద నీటిలో నిలబడి రిపోర్టింగ్ చేయడం, ఆ వీడియో కూడా నెట్టింట్లో హల్‌చల్ చేస్తుండడం తో నెటిజన్లు భిన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మొత్తానికి పాక్ రిపోర్టర్స్ మాత్రం వింత వింత తీరులో తమ రిపోర్టింగ్ టాలెంట్స్ ను బయటపెడుతూ విమర్శలు పాలవుతున్నారు.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు