కోకాకోలాకి పోటీ వచ్చేసింది.. ఈ డ్రింక్ విశేషాలు ఇవే!!

మండే వేసవి కాలం వచ్చేసింది.ఇక వేసవి తాపాన్ని తగ్గించడం కోసం మార్కెట్లోకి రకరకాల కోల్డ్ డ్రింక్స్ రావడం మొదలయ్యింది.

అవి జనాన్ని చల్లబరచడంతో పాటు, పోటీగా ఉన్న కంపెనీల్లో వేడి పెంచేస్తుంటాయి.ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఒక కొత్త కోల్డ్ డ్రింక్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

రిటైల్ వ్యాపారంలో ఉన్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్కు చెందిన FMCG కంపెనీ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, కోల్డ్ డ్రింక్ బ్రాండ్ కాంపాను మార్కెట్లోకి లాంచ్ చేసింది.ప్రస్తుతానికి ఒక మూడు ఫ్లేవర్లతో కాంపా పోర్ట్‌పోలియోను ప్రారంభించింది.

వాటిలో ఒకటి కాంపా కోలా, రెండవది కాంపా లెమన్, మూడవది క్యాంపా ఆరెంజ్.

Advertisement

పెప్సీ, కోక-కోలా లాంటి కంపెనీలకు పోటీగా కాంపా బ్రాండ్‌ను రీస్టార్ట్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్.నిజానికి కాంపా బ్రాండ్ కొత్తదేమీ కాదు, కొన్ని దశాబ్దాలుగా భారతీయ మార్కెట్లో ఒక వెలుగు వెలిగింది.1970, 1980 సంవత్సరాలలో భారతదేశ పానీయాల మార్కెట్లోని అతి పెద్ద కంపెనీల్లో ఇది ఒకటి.1990లో కోకా-కోలా పెప్సీ కంపెనీలు రావడంతో అంతా తలకిందులైంది.వాటి పాపులారిటీ ముందు నిలబడలేక రిలయన్స్ ఇండస్ట్రీస్ మూలనబడింది.

తన FMCG వ్యాపారాన్ని మరింతగా పెంచే వ్యూహంలో భాగంగా, గతేడాది ఆగస్టులో, సాఫ్ట్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూస్ తయారీ సంస్థ సోస్యో హజూరి బేవరేజెస్‌లో 50 శాతం వాటాను రిలయన్స్ రిటైల్‌కి చెందిన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ సొంతం చేసుకుంది.

ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి కాంపా బ్రాండ్‌ను సోస్కో అంతకుముందే దక్కించుకుంది.సోస్కోలో వాటా కొనుగోలుతో కాంపా బ్రాండ్ రిలయన్స్ సొంతమైంది.ఆరు నెలల తర్వాత, కాంపా బ్రాండ్‌కి కొత్త మెరుగులద్ది మార్కెట్లోకి విడుదల చేసింది రిలయన్స్.

మొదటిగా రిలయన్స్ ఈ డ్రింక్ ని తెలుగు రాష్ట్రలలో లాంచ్ చేసింది.ఆ తరువాత దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తుంది.అన్ని క్వాంటిటీలలో ఈ డ్రింక్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే వీటిని కొనుగోలు చేసి ఈ ఎండాకాలం దాహార్తిని తీర్చుకోవచ్చు.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు