రాధేశ్యామ్ సినిమా పోస్ట్ పోన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్!

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా జనవరి 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కావాల్సి ఉండగా అనుకోని విధంగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు చిత్రబృందం.

అయితే ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడిన కూడా, ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా అయిన విడుదల అవుతుంది అని భావించారు.కానీ ఊహించని విధంగా రాధే శ్యామ్ సినిమా కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో ఒకవైపు ప్రేక్షకులతో పాటు, మరొకవైపు ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

ఇక రాధేశ్యామ్ సినిమా కూడా విడుదల వాయిదా పడడంతో మీమ్స్ క్రియేటర్స్ ఒక్కొక్కరు తమ బుర్రలకు పదును పెట్టి మరి రాధేశ్యామ్ సినిమాపై మీమ్స్ ను క్రియేట్ చేస్తున్నారు.అభిమానులు ఏవిధంగా రియాక్ట్ అవుతారో ఊహించి, మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ పోన్ అవ్వగానే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయ్యి ఉంటారో ఊహించుకుంటూ ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల పరిస్థితి కూడా ఇదే అన్నట్టుగా మీమ్స్ తయారు చేస్తున్నారు.

Advertisement

పాన్ ఇండియా మూవీస్ అయిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు పోస్ట్ పోన్ కావడం, ముందుగా అనుకున్నట్టు సంక్రాంతి బరిలో కింగ్ నాగార్జున బంగార్రాజు సినిమా రావడాన్ని కొందరు గొప్పగా చెబుతున్నారు.మరికొందరు తట్టుకోలేక పోతున్నారు. రాధేశ్యామ్ పోస్ట్ పోన్ అయ్యిందని ప్రభాస్ ఫ్యాన్స్ బాధపడుతుంటే, దానిపై వచ్చిన మీమ్స్ చూసి సగటు తెలుగు ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తున్నాడు.

పెద్ద పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు చిన్నా చితకా దాదాపు డజను సినిమాలు సంక్రాంతి కి థియేటర్ లలో విడుదలకానున్నాయి.

Advertisement

తాజా వార్తలు