ఆర్ఆర్ఆర్ లో రామరాజు పాత్రకు చరణ్, భీమ్ పాత్రకు తారక్ ను ఎంచుకోవడానికి కారణాలివే!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా కళ్లు చెదిరే విజువల్స్ తో తెరకెక్కించారు.

ఈ నెల 25వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇంటర్వ్యూల ద్వారా జక్కన్న అంచనాలను పెంచేశారు.

ఆర్ఆర్ఆర్ లాంటి వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేసి సినిమాను మొదలుపెట్టిన జక్కన్న ఫ్యాన్స్ కు నచ్చడంతో అదే టైటిల్ గా ఫిక్స్ చేశారు.ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి ఈ సినిమాకు వేరే టైటిల్స్ ను పరిశీలించలేదని వెల్లడించారు.

రామరాజు పాత్రకు చరణ్ ను, భీమ్ పాత్రకు తారక్ ను తీసుకోవడం గురించి రాజమౌళి స్పందిస్తూ రామ్ పాత్ర ప్రకారం అగ్నిని గుండెలలో దాచుకున్న స్థితప్రజ్ఞత ఉండాలని చరణ్ లో అది ఎక్కువ ఉంటుంది కాబట్టి అతనిని ఆ పాత్రకు ఎంపిక చేశామని తెలిపారు.కష్టం వచ్చినా సుఖం వచ్చినా తొణకడు కాబట్టి ఆ పాత్రను చరణ్ కు ఇచ్చానని రాజమౌళి అన్నారు.

Reasons Behind Charan For Ramaraju Role Ntr For Bheem Role Details Here , Chara

భీమ్ మనస్సులోని భావాలను దాచుకోలేడని అమాయకమైన వ్యక్తి అని అందువల్ల ఆ పాత్రకు తారక్ ను ఎంపిక చేశామని రాజమౌళి కామెంట్లు చేశారు.ఆర్ఆర్ఆర్ మూవీ అభిమానులకు డబుల్ బొనాంజా అని జక్కన్న చెప్పుకొచ్చారు.సినిమాలో ఎమోషన్లపై ఎక్కువగా దృష్టి పెట్టానని ఇద్దరు హీరోలపై ప్రేక్షకులలో ఒకే రకమైన భావన కలగకపోతే కథ ఫెయిల్ అయినట్టేనని జక్కన్న వెల్లడించారు.

Reasons Behind Charan For Ramaraju Role Ntr For Bheem Role Details Here , Chara
Advertisement
Reasons Behind Charan For Ramaraju Role Ntr For Bheem Role Details Here , Chara

తన మదిలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయని ఎన్నో కథలు ఉంటాయని జక్కన్న తెలిపారు.తాను ఆర్ఆర్ఆర్ గురించి మొదటినుంచి చెబుతున్నానని ఈ సినిమా ఫిక్షనల్ అని బయోపిక్ కాదని రాజమౌళి వెల్లడించారు.ఈ సినిమా కథ, పాత్రలు అంతా కల్పితమే అని జక్కన్న కామెంట్లు చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేయడం లేదని ఇది సింగిల్ మూవీ అని జక్కన్న వెల్లడించారు.

Advertisement
" autoplay>

తాజా వార్తలు