మాస్‌రాజా మరో బిగ్ వార్ కు సిద్ధం... ధమాకా రేంజ్ హిట్‌ అయితే పెంచడం ఖాయం

మాస్ మహారాజా రవితేజ( Ravi teja ) మునుపటి జోరు చూపిస్తున్నారు.

ఆయన గతంలో ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి స్టార్ హీరోలని, ఇతర ఫిలిం మేకర్స్ ని మరియు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేవారు.

ప్రస్తుతం రవితేజ జోరు చూస్తుంటే అప్పటి కాలం గుర్తుకొస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కొన్ని వారాల క్రితమే రవితేజ నుండి ధమాకా చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రవితేజ జోరు పెరిగింది.కాస్త ఆలస్యంగానే విడుదల అవుతుందనుకున్న రావణాసుర చిత్రాన్ని వచ్చే వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

లాయర్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు.టీజర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు ఆకాశాన్ని పెరిగాయి.

Advertisement
Ravi Teja Ravanasura Movie Release Next Week ,ravi Teja , Ravanasura , Remune

ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన ఔట్పుట్ వచ్చిందని చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు.ధమాకా స్థాయిలో( Dhamaka ) రవితేజ అభిమానులకు మరో మాస్ మసాలా విజయం ఖాయం అంటూ నమ్మకంగా చెబుతున్నారు.

Ravi Teja Ravanasura Movie Release Next Week ,ravi Teja , Ravanasura , Remune

ధమాకా వంద కోట్ల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు, ఇప్పుడు అదే తరహాలో రావణాసుర సినిమా కూడా భారీగా వసూళ్లు సాధిస్తే కచ్చితంగా రవితేజ తన రెమ్యూనరేషన్( Remuneration ) ని రెట్టింపు చేసే అవకాశాలు ఉన్నాయి.ఆ మధ్య వరసగా ఫెయిల్యూర్స్ కారణంగా రవితేజ రెమ్యూనరేషన్ టైర్ 2 హీరోల కంటే కూడా తగ్గింది.అందుకే ఇప్పుడు బ్యాక్ బ్యాక్ సక్సెస్ ల వల్ల రవితేజ తన రెమ్యూనరేషన్ భారీగా పెంచే అవకాశం ఉంది.

Ravi Teja Ravanasura Movie Release Next Week ,ravi Teja , Ravanasura , Remune

తనతో సినిమాలు నిర్మించేందుకు అప్పుడు నిర్మాతలు ముందుకు రాక పోవడంతో సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి నిర్మాణం భాగస్వామిగా వ్యవహరిస్తూ వస్తున్న రవితేజ ఇకపై పూర్తిగా ఇతర నిర్మాణ సంస్థలోనే సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.సొంతంగా రిస్క్ తీసుకోకుంటేనే బెటర్ అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి రవితేజ భారీగా రెమ్యూనరేషన్ తీసుకోవాలి అంటే వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రావణాసుర చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల్సి ఉంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?
Advertisement

తాజా వార్తలు