డిస్కో రాజా ప్రీరిలీజ్ బిజినెస్.. రవితేజపై ఎందుకంత నమ్మకం?

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ డిస్కో రాజా అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఇప్పటికే ఈ సినిమాపై మాస్ ప్రేక్షులతో పాటు అన్ని వర్గాల ఆడియెన్స్‌లలో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సైన్స్ ఫిక్షన్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రవితేజ పాత్రపై అందరిలో ఆసక్తి నెలకొంది.ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ చూస్తే రవితేజ ఫెయిల్యూర్స్‌‌ను పక్కనబెట్టి మరీ బయ్యర్లు సినిమా హక్కులను కొన్నట్లు స్పష్టం అవుతుంది.

రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా మిగిలాయి.దీంతో రవితేజ సినిమాలపై బయ్యర్లకు నమ్మకం లేదనే వార్త ఇండస్ట్రలో చక్కర్లు కొట్టింది.

కానీ, డిస్కో రాజా ప్రీరిలీజ్ బిజినెస్ చూస్తే బయ్యర్లకు రవితేజపై ఎలాంటి నమ్మకం ఉందో స్పష్టమవుతోంది.అన్ని ఏరియాలు కలిపి ఈ సినిమా ఏకంగా రూ.22 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు చిత్ర వర్గాల లెక్కలు చెబుతున్నాయి.ఏరియాలవారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.నైజాం : 6 కోట్లు వైజాగ్ : 2 కోట్లు ఈస్ట్ గోదావరి : 1.2 కోట్లు వెస్ట్ గోదావరి : 1 కోటి కృష్ణ : 1.25 కోట్లు గుంటూరు : 1.5 కోట్లు నెల్లూరు : 75 లక్షలు సీడెడ్ : 2.65 కోట్లు కర్ణాటక : 1 కోటి ఓవర్సీస్ : 1.5 కోట్లు ఇతర : 3 కోట్లు మొత్తం : 22 కోట్లు.

Advertisement
ఆ విషయంలో చిరంజీవి బాలకృష్ణ సేమ్ టూ సేమ్.. బాబీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు