మన దేశంలో ఇట‌లీ పీసా టవ‌ర్ కంటే ఎత్తు, వంపు క‌లిగి ఉన్న ప్రదేశం... అదెక్కడో మీకు తెలుసా..?

" లీనింగ్ టవర్ ఆఫ్ పిసా " ఈ టవర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ఇటలీ లోని ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశం ఈ టవర్.

ఈ టవర్ ను వీక్షించేందుకు అనేక వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు.ఇక ఈ టవర్ ఒక పక్కకు వంగి ఉంటుందన్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే.

Leaning Tower Of Piece, Italy, India, Varanasi, Kasi, Ratneshwar Mahadev Mandi

అయితే నిజానికి సరిగ్గా ఇలాంటి నిర్మాణమే మన భారతదేశంలో కూడా ఒకటి ఉందన్న విషయం చాలామందికి తెలియనే తెలియదు.అవును నిజం.

ఎక్కడ ఉంది.? ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా.? అయితే మిరే చదివి తెలుసుకోండి.పీసా టవర్ లాగానే ఈ టవర్ నిర్మాణం కూడా ఒక వైపుకు వంగి ఉంటుంది.

Advertisement

కానీ, పిసా టవర్ కన్నా భారతదేశంలో ఉండే టవర్ కోణం ఇంకొద్దిగా ఎక్కువగానే ఉంటుంది.ఇక ఈ కట్టడం వారణాసిలోని రత్నేశ్వ‌ర్ మహాదేవ మందిరం.ఈ మందిరం పీసా టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది కూడా.

పీసా టవర్ ఎత్తు 54 మీటర్లు అయితే, ఈ ఆలయం 74 మీటర్లు ఉంది మరి.అలాగే పీసా టవర్ 4 డిగ్రీల కోణంలో వంగి ఉంటే.ఈ ఆలయం మాత్రం తొమ్మిది డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది.

అంతేకాకుండా ఈ ఆలయం కింది భాగం ఎప్పుడు నీటిలోనే మునిగి ఉంటుంది.అయినప్పటికీ కూడా ఈ ఆలయం పీసా టవర్ కన్నా ఎక్కువ ఎత్తుగా ఉండడం ఎక్కువ కోణంలో వంగి ఉండటం విశేషమే.

రత్నేశ్వ‌ర్ మహాదేవ మందిరం కాశీ లోని గంగా నది ఒడ్డున ఉంటుంది.గత సంవత్సర కాలం క్రిందట దాదాపు ఈ ఆలయం మొత్తం నీటిలోనే మునిగి పోయింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్

అలాగే గర్భగుడి కూడా నీటిలోనే ఉంటుంది.వర్షాకాల సమయంలో అయితే నీటి స్థాయి మరింత పెరిగి ఆలయం మునిగిపోతుంది.

Advertisement

ఇది ఇలా ఉండగా.ఈ ఆలయం ఇలా ఒక పక్కకు వంగి ఉండడడం ఎందుకో ఇప్పటివరకు ఎవరూ కూడా గ్రహించలేకపోయారు.

ఇక అప్పటి కాలంలో రాజ్ పుత్ రాజు రాజా మాన్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మాణం చేపట్టారని తెలుపుతున్నారు.అతను రత్నాబాయి అనే తన తల్లి కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పటి కాలం వారు తెలుపుతున్నారు.

అయితే రత్నాబాయి మాత్రం తన ప్రేమకు వెల‌క‌డ‌తావా అంటూ అతని శపించిందట.దీనితో ఆ ఆలయం ఒక పక్కకు వాలి ఉంటుందని పురాణాలూ చెబుతున్నారు.

తాజా వార్తలు