బేబీ సినిమాకు విజయ్, రష్మిక రివ్యూ ఇదే.. ఆనంద్, వైష్ణవి గురించి అలా చెబుతూ?

ఈరోజు విడుదలైన బేబీ సినిమా( Baby Movie ) గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను మరీ దారుణంగా చూపించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి పాత్ర పోషించిన వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) గట్స్ కు కూడా కూడా హ్యాట్సాఫ్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ సినిమా గురించి రష్మిక స్పందించి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.

బేబీ సినిమా చూసి రష్మిక( Rashmika ) ఎమోషనల్ కావడంతో పాటు సినిమా బాగుందని చెప్పుకొచ్చారు.రష్మిక తనకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసిందని చెప్పకనే చెప్పేశారు.

విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి స్పందిస్తూ ఆసక్తికర కామెంట్లు చేశారు.ఈరోజు నేనెంతో గర్వపడుతున్నానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

Advertisement
Rashmika Vijay Devarakonda Review For Baby Movie Details, Rashmika, Vijay Devara

ఎస్కేఎన్, సాయి రాజేశ్ అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించారని ఆయన పేర్కొన్నారు.

Rashmika Vijay Devarakonda Review For Baby Movie Details, Rashmika, Vijay Devara

వైష్ణవి చైతన్య తన నటనతో ఏడిపించేశారని విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) వెల్లడించారు.ఆనంద్, విరాజ్ అశ్విన్ ఈ సినిమాలో బాగా చేశారని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.బేబీ సినిమా కోసం పని చేసిన టీం అందరి విషయంలో గర్వపడుతున్నానని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు.

త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడతానని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

Rashmika Vijay Devarakonda Review For Baby Movie Details, Rashmika, Vijay Devara

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో( Khusi Movie ) సమంతతో కలిసి నటిస్తున్నారు.ఈ సినిమా నుంచి తాజాగా ఆరాధ్య సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

విజయ్, రష్మిక కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.ఈ కాంబినేషన్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు వస్తాయేమో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు