ఖమ్మం కాంగ్రెస్ సమావేశంలో రసాభాస

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఎదుటే పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.

సమావేశంలో భాగంగా సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు.వీహెచ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కార్యకర్తలు జిల్లాలో మీ కోఆర్డినేషన్ ఏంటని ప్రశ్నించారు.

అనంతరం వీహెచ్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.మరోవైపు సమావేశానికి రేణుకా చౌదరి రాగానే భట్టి విక్రమార్క మధ్యలోనే వెళ్లిపోయారు.

దీంతో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు