ఇంటి ముందు ముగ్గు వేయడం వెనుక గల రహస్యం ఏమిటో తెలుసా..?

ఉదయం లేవగానే పల్లెలో అయినా పట్టణాలలో అయినా ఇంటి ముందు చెత్త ఊడ్చి, నీళ్లు చల్లి ముగ్గులు వేస్తుంటారు.

పూర్వకాలంలో అయితే ప్రతిరోజు కల్లాపి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేసే వారు.

అయితే ప్రస్తుతం ఇంటి ముందు అంత స్థలం లేని కారణంగా చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని భావిస్తారు.

అసలు మొదటిగా ముగ్గులని ఎవరు కనిపెట్టారు.ముగ్గులు వేయడం వెనక గల కారణం ఏమిటి అన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ముగ్గులు ఫలానా కాలం నుంచి వేస్తున్నారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, పూర్వకాలం నుంచి ముగ్గులు వేస్తున్నారని చెప్పవచ్చు.ఎందుకంటే అన్ని పురాణాలలో కూడా ఈ రంగవల్లి ప్రస్తావన ఉంది కనుక పూర్వ కాలం నుంచి ఈ ఆచారం ఉండేదని తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు.ఆయన గురువుకు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక కొడుకు జన్మిస్తాడు కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల అతని పుత్రుడు మరణించడంతో ఆ గురువు శోకసంద్రంలో మునిగి పోయాడు.

పుత్ర మరణంతో ఎంతో బాధపడిన గురువు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు.అతని తపస్సుకు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు ఏం వరం కావాలో కోరుకొమ్మని అడుగగా తన పుత్రుడు తిరిగి తనకు దక్కాలని వరం కోరుకుంటాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు నీతో సహా రాజ్య ప్రజలందరూ కూడా ఇంటి ముందు ఊడ్చి, కల్లాపి చల్లి రంగవల్లులు తీర్చిదిద్దమని చెబుతాడు.రాజాజ్ఞ మేరకు ఊరి ప్రజలందరూ ఇల్లు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేశారు.

గురువు ఇంటి ముందు కూడా అచ్చం తన కొడుకు బొమ్మను వేశారు.ఊరంతా ఈ విధంగా చేయడంతో సంతోషించిన బ్రహ్మదేవుడు తిరిగి ఆ గురువు కొడుకును బ్రతికించాడని,అప్పటి నుంచి ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పవచ్చు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

ఎవరైనా మన ఇంటిలో మరణిస్తే ఆ ఇంటిముందు ముగ్గు వేయరు.ఆ విధంగా ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండదో ఆ ఇంటికి భిక్షకులు, సాధుసన్యాసులు భిక్షకు కూడా వెళ్లరు.

Advertisement

అందుకే ప్రతి రోజూ ఉదయం లేవగానే ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల శుభ పరిణామాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు