మాటిచ్చిన రామన్న దివ్యాంగుడికి ఆటో అందజేత

ఎల్లారెడ్డిపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములో మంగళవారం డే కేర్ సెంటర్ ను ప్రారంభించడానికి వచ్చిన సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ పూర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఆకారం నర్సయ్య తన పిల్లలను పోషించుకోవడం తన బ్రతుకు దెరువు కోసం ఆటో ఇప్పించాలని కేటీఆర్ ను కోరారు.

కెటిఆర్ కు మొరపెట్టుకోడానికి దివ్యాంగుడైన తండ్రి తో పాటు వచ్చిన అతని పెద్ద కూతురు మాధురి ( 14), చిన్న కూతురు గౌతమి ( 12 ) లు మాకు తల్లి లేదు మా బ్రతుకు దెరువు కోసం మా తండ్రి నర్సయ్య కు ఆటో ఇప్పించాలని కెటిఆర్ ను వారు కోరారు.

వెంటనే స్పందించిన కెటిఆర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ని రేపటి లోగా నర్సయ్య కు అటు ఇప్పించాలని ఆదేశించారు.రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు దివ్యాంగుడైన వికలాంగునికి దళిత బంధు పథకం కింద మంజూరైన ఆటోను నరసయ్యకు ఎల్లారెడ్డిపేట తహాసిల్దార్ కార్యాలయం ఎదుట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణ్ రావు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య లు ఆటో ను నర్సయ్య కు వారి ఇద్దరు కూతుళ్లకు ఆటోను అందజేశారు.

కోరిన వెంటనే ఆటోను అందించి తమ జీవితానికి ఆధారం చూపిన మంత్రి కేటీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని నరసయ్య కుటుంబ సభ్యులు తెలిపారు.దివ్యాంగుడి కల నెరవేర్చి అతని కళ్లలో ఆనందాన్ని నింపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ కార్పోరేషన్ ఎండి వినోద్ కుమార్, తహశీల్దార్ జయంత్ కుమార్, ఎంపిడిఓ , చిరంజీవి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, ఎంపీటీసీ సభ్యురాలు ఎండి అపేరా సుల్తానా మజీద్,పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు,.

Advertisement
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

తాజా వార్తలు