గుంటూరులో ఇద్దరు మైనర్లు గంజాయి మత్తులో, దుకాణాలలో చోరీకి యత్నించి ఇద్దరూ వాచ్మెన్లను దారుణంగా హత్య చేశారు.పోలీసుల సమాచారం ప్రకారం గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డులో బుధవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఇద్దరు మైనర్లు గంజాయి మత్తులో బైక్ షో రూమ్ లో చోరీకి ప్రయత్నించారు.
రిటైర్డ్ కానిస్టేబుల్ కృపానిది ఆ షోరూంకు వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తూ ఆ ఇద్దరు మైనర్లను అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
ఆ యువకులు ఒక గడ్డపారతో కృపానిది తలపై కొట్టడంతో కుర్చీలోనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
అనంతరం షాపు అద్దాలు పగలగొట్టి దొంగతనం చేయడం సాధ్యం కాలేదు.కాసేపు ప్రయత్నించి అక్కడి నుండి అరండల్ పేట వద్ద ఉన్న లిక్కర్ స్టోర్ లోకి చొరబడ్డారు.
ఆ స్టోర్ కు వాచ్మెన్ గా ఉన్న సాంబశివరావు పై దాడి చేసి చంపేశారు.
అనంతరం షట్టర్ తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేసిన సాధ్యపడకపోవడంతో అక్కడినుండి వెళ్ళిపోతూ, సమీపంలోని మరో మూడు దుకాణాల సెంటర్లు మీసేవ కేంద్రాల తాళాలు పగలగొట్టి చొరబడే ప్రయత్నం చేస్తుండగా పక్కనే ఉన్న స్వీట్ షాప్ యజమాని గట్టిగా కేకలు వేయడంతో అతనిని తీవ్రంగా గాయపరిచి సెల్ ఫోన్ షాపులోని కొన్ని ట్యాబ్ లను ఎత్తుకొని వెళ్లారు.తర్వాత డొంక రోడ్డు గుండా పాత గుంటూరు వెళ్లి ఎలక్ట్రానిక్ దుకాణం, 2 ఫైనాన్స్ కార్యాలయాలు, ఒక కూల్ డ్రింక్ షాప్ లలోకి చొరబడి కొన్ని వస్తువులను దొంగతనం చేసి వెళ్లిపోయారు.ఇద్దరు మైనర్ యువకులు తెల్లవారుజామున 2:30 నుంచి 4:30 గుంటూరు నగరంలో హల్చల్ చేశారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి రాజీవ్ గృహకల్ప వద్ద అరెస్టు చేశారు.నిందితులు నగరంలోని కోబాల్ట్ పేటకు చెందినవారుగా గుర్తించారు.