వెంకన్న అంటే నమ్మకం లేని జగన్ వద్దకి దీక్షితులు..గతం మర్చిపోయారా..?

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది చెందిన దేవాలయం ఏపీ లోని తిరుమల తిరుపతి క్షేత్రం.

ఎంతో మంది భక్తులు విదేశీ భక్తులు సైతం స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అయితే ఈ సందర్భంలో మతం మార్పిడి అయిన వాళ్ళు వాళ్ళు స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ఆలయ నిభంధనల ప్రకారం తప్పకుండా అక్కడ ఉండే డిక్లరేషన్ పై సంతకం పెట్టి వెళ్ళాలి.

ఆ డిక్లరేషన్ సారాంశం ఏమిటంటే.నేను మతం మారినా సరే స్వామి వారిపై ఎంతో నమ్మకంతో వచ్చారు ఆయన అంటే నాకు ఎంతో గౌరవం ఉంది అని అన్ని సమ్మతించి నేను దర్సనం చేసుకోవడానికి వచ్చాను అని చెప్పడానికి ఈ డిక్లరేషన్ పై సంతకం తీసుకుంటారు.

సరే ఈ విషయం కాస్త పక్కన పెడితే.

గత 15 రోజులుగా తిరుమల కొండపై జరుగుతున్న రాజకీయాలు మనకి తెలిసినవే ఎవరి స్వార్ధానికి వాళ్ళు తిరుమలని రాజకీయంగా ఉపయోగిస్తున్నారు.గత 30 ఏళ్లుగా పని చేస్తున్నాను స్వామి దగ్గర అని చెప్తున్న ఆయన అక్కడ అక్రమాల గురించి విలేఖరుల సమావేశం పెట్టి మరీ తిరుమలని రోడ్డు కి ఈడ్చుతున్న ఆయన ఇప్పుడు హటాత్తుగా ఎందుకు బయటకి వచ్చారు ఇన్నేళ్ళు ఎక్కడ దాక్కున్నారు.? అంటే ఆ ప్రశ్నకి సమాధానం లేదు సరే టీడీపీ వాళ్ళు పట్టించుకోవడం లేదు అంటే మరి ఇప్పుడు బీజేపి వద్దకి వెళ్లినట్లుగానే మీడియా ముందు మాట్లాడినట్టుగానే ఎందుకు అప్పుడు స్పందించలేదు.? అయితే ఇప్పటివరకూ జరిగిన ఈ తంతులో ఒక్క రోజుకూడా బ్రాహ్మణ సంఘాలు తలదూర్చలేదు ఎందుకంటే అసలు నిజానిజాలు ఏమిటో తెలియదు సో వేచి చూసి స్పందించవచ్చు అనుకున్నారు.అయితే దీక్షితులు నిన్న జగన్ ని లోటస్ పాండ్ లోని అతడి ఇంటివద్ద పడిగాపులు కాచి మరీ వెళ్లి కలవడం బ్రాహ్మణులకి బీపీ తెప్పిస్తున్నాయి.

Advertisement

అదేంటి ఇప్పటివరకూ దీక్షితులు ఎవరిని కలిసినా మాట్లాడిని వాళ్ళు ఇప్పుడు ఏకంగా ధర్నాలు చేస్తామని అంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారు ప్రజలు.అయితే దీనికి రీజన్ కూడా చెప్తున్నారు.

అతడు కులం మారాడనో కాదు వెంకటేశ్వర స్వామిపై కనీసం నమ్మకం ,గౌరవం, భక్తి భావన లేని వాడికి తిరుమలని కాపాడమని చెప్పడం చాలా చిత్రంగా ఉందని మండిపడుతున్నారు.అయితే అసలు రీజన్ ఏమిటంటే.

మొదట్లో మనం డిక్లరేషన్ గురించి మాట్లాడుకున్నాం మతం మారిన వాళ్ళు డిక్లరేషన్ పై సంతకం చేయాలని కిందటి ఏడాది జగన్ మోహన్ రెడ్డి తిరుమల స్వామివారిని దర్శించుకున్న సమయంలో ఆలయ అధికారులు అక్కడ ఉన్న డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందిగా జగన్ ని అడిగారు అయితే జగన్ నేను చేయనని చెప్పి అక్కడి నుంచీ వెళ్ళిపోయారు అధికారులు ఎంతగా వారించినా సరే జగన్ ససేమిరా అన్నారు అయితే అదే సమయంలో చెవిరెడ్డి సైతం డిక్లరేషన్ పై సంతకం చేయమని అడుగగా అందరి ముందు చెవిరెడ్డి ని జగన్ తిట్టడంతో ఆయన చిన్నబుజ్జు కున్నారు.అయితే ఇదే విషయాన్ని బ్రాహ్మణ సంఘాలు దీక్షితులని ప్రశ్నిస్తున్నారు.

తిరుమల వచ్చి ఆలయ సాంప్రదాయాన్ని గౌరవించలేదు జగన్ పైగా డిక్లరేషన్ పై సంతకం చేయనని అన్నాడు.అలాంటి వాడి వద్దకి వెళ్లి స్వామివారిని తిరుమల కొండని కాపాడమని ఎలా అడుగుతున్నావ్ నీకు నోరు ఎలా వచ్చింది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
పెళ్లి కొడుకే స్వయంగా మంత్రాలు చదువుతూ పూజారిగా మారాడు.. వీడియో చూస్తే అవాక్కవుతారు!

అంటూ తెగ తిట్టిపోస్తున్నారు.ఇప్పటి వరకూ నిన్ను సమర్ధిస్తూ వచ్చాము ఇక నీ పరవర్తనతో స్వామి వారికి కూడా ఆగ్రహం తెప్పిస్తున్నావు ఇదంతా రాజకీయ ప్రయోజనం కోసమేకదా అంటూ మండిపడుతున్నారు బ్రాహ్మణు సంఘాలు మరి జగన్ ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు