దేవీ నాగవల్లి, విశ్వక్ సేన్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్.. నిజమా, సెటైరా అంటూ నెటిజన్స్ కామెంట్స్!

టాలీవుడ్ హీరో విశ్వక్​ సేన్​, రుక్సార్​ దిల్లాన్​ కలిసి నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం.

ఈ సినిమాకు విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన విషయం తేలిసిందే.

ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఫ్రాంక్ వీడియో తో హీరో విశ్వక్ సేన్ విమర్శల పాలైన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే విశ్వక్​ సేన్​, చిత్ర పరిశ్రమకు చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది ప్రముఖ టీవీ ఛానెల్.

ఈ క్రమంలోనే యాంకర్​కు విశ్వక్​ సేన్​ కు మధ్య మాటల యుద్ధం జరిగింది.అప్పుడు సదరు యాంకర్ స్టూడియో నుంచి గెట్ అవుట్ అంటూ హీరో విశ్వక్ సేన్ పైకి గట్టిగా అరిచినా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఇదే విషయం ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మార్మోగిపోతోంది.యాంకర్, హీరో ని గెటవుట్ ఆడడం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే తాజాగా ఇదే విషయంపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఒక పురుషుడి కన్నా పవర్​ఫుల్​గా ఒక మహిళ కనిపించడం నేను ఇంతవరకు చూల్లేదు.

ఆమె సర్కార్​ కన్నా తక్కువేం కాదు​ అంటూ ఆ యాంకర్​ను ట్యాగ్​ చేశాడు ఆర్జీవీ.కాగా ప్రాంక్ వీడియో కారణంగా ఇప్పటికే హీరో విశ్వక్​ సేన్​పై అరుణ్ కుమార్ అనే లాయర్ హ్యుమన్​ రైట్స్​ కౌన్సిల్​లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఏది ఏమైనప్పటికీ విశ్వక్ సేన్ ఫ్రాంక్ వీడియో వైరల్ అవ్వడం ఒక ఎత్తు అయితే,స్టూడియో నుండీ వెళ్ళిపొ గెట్ అవుట్ అంటూ అరవడం మరింత సంచలనంగా మారింది.

రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా లో ఆ కామెడీ సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారా..?
Advertisement

తాజా వార్తలు